చేతకాక మొసలి కన్నీరేందుకు?
అంతా మోసం.. దగా.. పోరాట పటిమ, తెగువా వంటి పచ్చి అబద్దాలు! ఉద్యామాన్ని హక్కులు సాధించే వరకు నడిపించడం చేతకాక చేతులెత్తేసి, 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును జగన్ రెడ్డి ప్రభుత్వానికి తాకట్టుపెట్టారు ఆ నలుగురు జేఏసీ నేతలు! ఇటువంటి స్వయం నిర్ణయాధికారం మీకెవరిచ్చారు? అని పలు ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయమని తోటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ నలుగురు జేఏసీ నేతలను నేడు నిలదీస్తుంటే వారికి పుండమీద కారం మాదిరిగా మండుతోంది! పైకి జేఏసీ ఛైర్మన్ల అని చెప్పుకుంటూనే.. లోపల వైసీపీ కండువా వేసుకున్న ఆ నలుగురు జేఏసీ నేతలు ఆడిన డ్రామాలు నేడు బట్టబయలయ్యాయి. అర్థరాత్రి నాలుగు గోడల మధ్య చర్చల పేరుతో ఉద్యోగులకు బిగించిన ఉరి.. బాహ్య ప్రపంచానికి క్లియర్ అర్థమైంది. అందుకే అప్పటి వరకు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు ఆ నాలుగు జేఏసీలకు దూరమయ్యారు. ఎటువంటి అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం వారి నిర్ణయాన్ని ప్రకటించడం కారణంగానే.. నేడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. స్టీరింగ్ కమిటీ పేరుతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బండి, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి లు చేసింది పచ్చి మోసమని.. జగన్ రెడ్డికి సాక్ష్యత్తు వీళ్లు ఏజెంట్లుగా పని చేశారని ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలు నేతలు ప్రత్యక్షంగానే ఆరోపిస్తున్నారు.
దుష్ప్రాచారం కాదు.. ఉన్నప్రచారమే.. ఉలికి పాటేందుకు?
సార్.. సీఎస్ గారు.. ఉపాధ్యాయ సంఘాలు మాపై కావాలనే దుష్ప్రాచారం చేస్తున్నారండి .. అంటూ ఆ నలుగురు జేఏసీ నేతలు లేఖ రాసే పరిస్థితికి దిగజారారు. పీఆర్సీకి సంబంధించిన డిమాండ్లపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని, అప్పటి నుంచి తమపై కొందరు టీచర్లు కావాలనే తమ పరువును బజారుకీడుస్తున్నారని జేఏసీ ఛైర్మన్లు సీఎస్‌కు మొరపెట్టుకున్నారు. అంతేకాక తమ కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో తిట్టిపోస్తున్నారన్నారని వాపోయ్యారు. నలుగురు జేఏసీ నేతలను వీధికుక్కలని తిట్టడం, తమ ఫోటోలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించడం వంటివి బాధకలిగిస్తున్నాయని చెప్పకొచ్చారు. చివరగా.. తోటి ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు పెట్టాలని సీఎస్‌ను వేడుకున్నారు. మ ఈవిధంగా అన్నదమ్ములు కలిసున్న ఉద్యోగులు మధ్య విబేధాల చిచ్చు రాజేసి.. హీనాతి హీనంగా విలువలను దిగజార్చింది జగన్ రెడ్డి ప్రభుత్వంమని మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నారు.
ap jac
Must Read:- కొత్త సీఎస్‌తో పాటు ఇద్దరు అడ్వైజర్లు