అన్న నేను పార్టీ వాడినే వదిలేయ్యండన్నా .. నీ కాళ్లుపట్టుకుంటా!
అన్న నేను మన పార్టీ వాడినే .. పార్టీ బాగుకోసం హితవు పలికా .. అంతేకానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అన్న.. అని కాళ్లావేళ్లా పడి బ్రతిమిలాడిన మంత్రి బాలినేని అనుచరులు కనికరించాలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు ఏపీలో భరోసా అసలు లేదు.. కనీసం మర్యాద, రక్షణ కూడా లేదు అన్నది ప్రకాశం జిల్లా వైసీపీ నేత సుబ్బారావు గుప్తా జరిగిన ఘోర పరాభవం బట్టే తెలుస్తోంది! మంత్రికి బయపడి లాడ్జీలో తలదాచుకున్న సుబ్బారావు గుప్తాను మంత్రి అనుచరులు చితకొట్టారు. మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణలు చెప్పించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూస్తే చాలు.. రాష్ట్రంలో జగన్ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలనకు ఏ పాటితో అద్దంపడుతోంది. ఒకపక్క పార్టీ గ్రాఫ్ పూర్తిగా తుడిచిపెట్టుకునిపోతున్నా .. మరోపక్క ఆటవిక సాంప్రదాయం, ఫ్యాక్షనిస్టు ప్రవృత్తి తాలూకు ఛాయలు ఇంకా అదికారపార్టీ విడనాడంలేదు. చట్టసభల్లో కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీలు వాడే పదజాలం సరిగా లేదు, వారి వల్లే పార్టీ పరువు దిగజారుతోందని సుబ్బారావు గుప్తా హితవు పలికితే .. వెతుకుంటూ వెళ్లి .. మరి దాడికి పాల్పడ్డారు ఆ పార్టీ నాయకులు. ప్రాథమిక హక్కులను కాలరేసేలా బూతులు తిడుతూ.. మానవ హక్కులను ఉల్లంగిస్తూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దౌర్జన్యకాండను వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదికాదా .. పరాకాష్టంటే!
వైసీపీ నేత సుబ్బారావు గుప్తా చేసినవి విమర్శలు కావు .. పచ్చి నిజాలు..!
వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఓ వేదికపై తనలోని అసంతృప్తిని వెల్లగక్కాడు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని, ద్వారంపూడి కారణంగా పార్టీ పరువుపోతుంది .. ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది అని గుప్తా ఆందోళన వ్యక్తం చేయడం తప్పా? దీనిని సరిచేసుకోకుండా సొంతపార్టీ నాయకుడని కూడా చూడకుండా గుప్తాను నోటికొచ్చినట్లు తిట్టి, భౌతికంగా దాడి చేస్తూ .. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంతవరకు సబబు! ఇటువంటి చర్యలను రాష్ట్ర ప్రజలు ఎలా హర్షిస్తారని .. ఆ వీడియో చూసిన ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. బాలినేని అనుచరుడు సుభానీ తన గ్యాంగ్ తో దాడి చేసి, మంత్రి బాలినేనికి క్షమాణలు చెప్పాలంటూ మోకాళ్లపై కూర్చోపెట్టి.. వీడియో చిత్రీకరించడం, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వంటివి చూస్తే అధికారపార్టీ అరాచక పాలనకు అద్దంపడుతోంది! సొంత పార్టీ నాయకులపైనే మంత్రులు దాడిచేయడాన్ని ప్రకాశం జిల్లాలోని అధికారపార్టీ నాయకులే ఖండిస్తున్నారు.










