కరోనా కేసులు పెరుగుతుండటం.. మరణాల సంఖ్య కూడా పైపైకి వెళ్తుండటంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ తాడేపల్లిలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఇప్పటికే ఏపీలో భారీ గా కరోనా కేసులు పెరుగుతుండటం.. కర్ఫ్యూ కూడా అమలులో ఉండటంతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో షెడ్యూల్ ప్రకారం జూన్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Must Read ;- ఏపీలో 12 వేలు దాటిన కరోనా కేసులు











