బాధ్యత రాహిత్యం కాదది .. బాధ్యతలు ఊడుతున్నాయని!
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని … ఈ మధ్య చాలా అసంతృప్తిగా కనిపిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ … ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సీరియస్ ప్రకటన చేశారు. అదే కేబినెట్ విస్తరణ. ఈ నెలలో ఏదో ఒక రోజు మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. జగన్ రెడ్డి ముందుగానే చెప్పినట్లు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం మందికి ఉద్వాసన తప్పదు అన్నట్లు కనిపిస్తోంది. ఈక్రమంలో ఉద్యాసనకు గురికానున్న లిస్ట్ లో పేర్ని నాని కూడా ఉన్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు కొడైకూస్తున్నారు. అందుకేనోమో ఈ మధ్య పేర్ని అంతా యాక్టీవ్ గా లేరు అన్నది ఆయన మోహంలో బాగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
మంత్రులు మాజీలౌతున్నారు అని తెలిస్తే .. అశ్రద్ధ ఆవహిస్తుందా?
మంత్రులు మాజీలౌతున్న వేళా అశ్రద్ధ వారిని ఆవహించింది. అందుకు నిదర్శనమే మంత్రి పేర్నినాని అని ఆయన పరిస్థితి చూస్తే ఇట్టే అర్ధమౌతోంది. ఆయన అసంతృప్తి, బాధ్యతల పట్ల అశ్రద్థ ఈ రోజు మీడియా కళ్లకు కట్టినట్లు కవర్ చేసింది. సోమవారం మధ్యాహ్నం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినేట్ అత్యవస భేటి జరిగింది. అది ముగించుకుని బయటకు వస్తున్న నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ కు చెందని మహిళా జర్నలిస్ట్ మంత్రి నాని వివరణ అడిగేందుకు ప్రత్నించారు. ఆ సమయంలో చాలా అసంతృప్తిగా మంత్రి సమాధానం చెప్పారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడుతున్నారా? అని జర్నలిస్ట్ అడిగి ప్రశ్నకు.. నాకేం తెలియదు.. నాకేం తెలియదు.. అంటూ విసుగ్గా సమాధానం చెబుతూ అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఆ తరువాత మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, గతంలో వికేంద్రీకరణ బిల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అని ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ ఇస్తున్నారు. సభ అంతా మంత్రి బుగ్గన చెబుతున్న అనేక అంశాలను శ్రద్ధగా విటుంది. ఆ సమయంలో బుగ్గన వెనుకనున్న పేర్ని… గుర్రుపెట్టి నిద్రపోయారు. ఆ సౌండ్ డిస్టమెన్స్ అనిపించి బుగ్గన ఒకసారి వెనక్కి తిగిరి నాని వారించగా తేరుకున్నాడు. అలా మంత్రి నాని ఈరోజు అలసి, సొలసి … అసెంబ్లీలో కునుకు తీసి … ఆ మహానుబావుడు నిర్వర్తించే సమాచార శాఖ కు సంబంధించిన కెమేరా కన్నుకు చిక్కాడు. ఇది టుడే జోక్ ఆఫ్ అసెంబ్లీ అని నెటిజన్లు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు.
Must Read ;- బేతంచర్ల స్పూర్తే.. తమ్ముళ్లకు ఆదర్శం!











