టీడీపీ ఓడినా .. గెలిచినట్లే!
బేతంచర్ల లో టీడీపీ ఓడినా .. ఇక్కడ గెలిచినట్లే! ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో ‘తెలుగుదేశం’తమ్ముళ్ల పన్నిన వ్యూహాలు అద్భుతంగా ఫలించాయి. వరుసగా ఆరు వార్డుల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఓడిన వార్డుల్లో గట్టి పోటినే ఇచ్చారు. అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించారు. సాక్ష్యత్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సొంత ఊరు .. అందులో సొంత వార్డులో టీడీపీ జెండాను తమ్ముళ్లు రెపరెపలాడించారు. ఇది స్పూర్తి అంటే అన్నట్లు ఓడిన వార్డుల్లో పోరాడి స్వల్ప మెజారిటీతో పరాజయాన్ని పొందారు. మంత్రి బుగ్గన ఉంటున్న 15 వ వార్డులో వైసీపీ అభ్యర్థి పై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విక్టరీతో మున్సిపల్ చైర్ ను గెలుచుకోకపోయిన పర్వాలేదు, బుగ్గన వార్డును ఓడించామని తెదేపా శ్రేణులు ఫుల్ జోష్ తో ఉన్నాయి. అయితే పంక పార్టీలో మాత్రం బేతంచర్ల మున్సిపల్ చైర్‌ను దక్కించుకున్నామన్న ఆనందం కన్నా మంత్రి వార్డు ఓడిపోయామే అన్న తీవ్ర నిరాశ కలతకు గురిచేస్తుందంటా!
బేతంచర్ల హైలెట్స్:
బేతంచర్ల మున్సిపాలిటీలో టీడీపీ శ్రేణులు ప్రదర్శించిన రాజకీయ చతురత, పన్నిన వ్యూహాలు బాగానే ఫలితానించింది. కుప్పంలో ఎన్నికల్లో చంద్రబాబు కంచుకోటను బద్దల్కొట్టాం అని సంబర పడుతున్న పంక పార్టీకి .. బేతంచర్ల తమ్ముళ్లు కొట్టిన వ్యూహాత్మక దెబ్బా.. అబ్బా! అనిపించేలా ఉందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. 20 వార్డుల బేతంచర్ల మున్సిపాలిటీలో మొత్తం 21,835 ఓట్లు పోల్ అవ్వగా .. అందులో టీడీపీ 9,531 ఓట్లును సాధించింది. వరుసగా 6,10,12,13,15,16 వార్డుల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. వైసీపీకి మొత్తం 11,069 ఓట్లు సాధించగా.. టీడీపీ కన్నా వైసీపీ సాధించింది కేవలం 1,538 ఓట్ల మాత్రమే. ఇదికాదా పరాభవం మంత్రిగారు .. సొంత వార్డుల్లో అభ్యర్థినే గెలిపించుకోలేని మీరు .. మీ విశ్వసనీయత వచనాలు రాష్ట్ర ప్రజలకు ఏమని వివరిస్తారని సోషల్ మీడియాలో ఛలోక్తులు మార్మోగుతున్నాయి.
Must Read ;- తమ్ముళ్ల దెబ్బ .. మంత్రులు అబ్బా !










