Former CM Chandrababu Accused Of AP Government Into Debts
ఉపాధి అవకాశాలు నిల్.. అప్పులు ఫుల్!
అది డిసెంబర్ 17, 2019 … రాష్ట్రంలో జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ ప్రకటించారు. బిల్లు పెట్లారు .. పాస్ చేశారు. అక్కడి నుంచి నేటి వరకు రాజధాని విషయంలో జగన్ రెడ్డి వ్యవహరించిన తీరే.. రాష్ట్రాభివృద్ధికి శాపంలా దాపురించింది. మూడు ముక్కలాటకు అలా తెరతీయ్యగానే.. ఒక్కసారిగా రాజధానిలో జరుగుతున్న రూ.40 వేల కోట్ల పనులు ఆగిపోయాయి. వచ్చి ఉన్నా, రాబోతున్న కంపెనీలు వెనకడు వేశాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారడంతో కంపెనీలు మోహం చాటేశాయి. యువతకు ఉపాధి అవకాశాలు లేక అనేక వడిదుడుకులను రాష్ట్రం ఎదుర్కొంది. ఆదాయానికి కూడా పెద్దఎత్తున గండిపడింది.
Former CM Chandrababu Accused Of AP Government Into Debts
వ్యవస్థల విధ్వంసాలకు విరమణనేదే లేదా..?
రాష్ట్రాదాయం ప్రతి నెల రూ.11 వేల కోట్లు అని చెబుతూనే .. ఖర్చులు, లోటు బడ్జెట్ ను జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి పెంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలోని పలు శాఖలకు సంబంధించిన ఆస్తులను ఇప్పటికే కుదవపెట్టి, అప్పులు పీకొచ్చాడు. చివరికి ఈ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపైనా, డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులపై పడి వాటిని గుంజుకోవాలని చూశాడు .. అది కొంచెం బెడిసి కొట్టి బయటకు పొక్కడంతో సద్దుమనిగారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ. 3,534 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించి, దుర్వినియోగానికి పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించాడు. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనల్లో వ్యవస్థలన్నీ తీవ్ర విధ్వంసానికి గురియ్యాయని ఆయన వాపోయ్యారు.
Must Read ;- ఏపీ ఖజానా ఖాళీ .. కేంద్రం నిధులతోనే అభివృద్థి!