ఏపీలో మారుతున్న రాజకీయాలు వైసీపీ పట్టి కుదిపేస్తున్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేలతోపాటు కేడర్ సైతం ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి.. పలాయనం చిత్తగిస్తున్నారు.
ఎన్నికల సమీస్తున్న కొద్దీ..ఏపీలో జగన్ రెడ్డి పార్టీకి గడ్డుకాలం దాపురిస్తోందన్న సంకేతం బలంగా కనిపిస్తోంది. అధికారం చేతులో ఉంది కదా.. అని ఈ నాలుగునరేళ్ళు విర్రవీగిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. నేడు జగన్ రెడ్డి అకృత్యాలు చూసి.. రియలైజ్ అవుతున్నారు. బతికుంటే బలుసాకైన తిని బతికేయ్యొచ్చు అన్న సామెతను.. ఎమ్మెల్యేలు, కేడర్ గుర్తేరిగి ముందు జాగ్రత్తగా వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయం.. మా వారుసులను బరి దింపుతాం అని అధిష్టానానికి ప్రపోజల్స్ పెడుతున్నారు. మరి కొందరైతే.. ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పి.. రాజీనామాలతో జగన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నారు.
ఈ నేపధ్యంలో మొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.., గాజువాక నియోజవర్గం ఇంచార్జ్ దేవన్ రెడ్డి రాజీనామాలు.., ఆ తరువాత రెండు నియోజకవర్గాల నుంచి కేడర్ చేస్తున్న రాజీనామాలు చూస్తే.. వైసీపీ పన్నుతున్న కుట్రలు కేడర్ కు అర్ధమై.., దూరంగా జరుగుతున్నారన్నది స్పష్టమవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో రెండు రోజులుగా దాదాపు రాజీనామా బాటలో 100 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సొంత పార్టీ వారే ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రులుగా ఉన్న రోజా.., అంబటి రాంబాబులతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి.., గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.
ప్రత్యేకించి నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజాను పక్కన పెట్టాలని ఎప్పటి నుంచో కేడర్ డిమాండ్లు వినిపిస్తూ వస్తోంది. ఇప్పటికే రోజాకు ఈ సారి టికెట్ ఇస్తే .. ఓడించి తీరుతామని కేడర్ .. జగన్ రెడ్డికే నేరుగానే అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో రోజాను పక్కన పెట్టి.. నగరికి కొత్త ఇంచార్జ్ తెచ్చి పెట్టేందుకు యత్నాలు సాగిస్తుంది వైసీపీ. కేడర్ డిమాండ్లతో పాటు సర్వేలు కూడా రోజాకు ఘోర పరాజయం తప్పదని అన్న నివేదికలిస్తున్నాయి. అలానే పేర్ని నాని.., కోడాలి నాని.., ఆళ్ళ నాని.., వల్లభనేని, రాంబాబులకు కూడా ఘోర ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే లెక్కలు వేసి సిట్టింగ్ స్ధానాల ఎమ్మెల్యేలను కాదని.. కొత్తవారిని ఇంచార్జ్ లుగా తెచ్చిపెడుతోంది వైసీపీ.











