రోజా సెల్వమణి ఒకఅనామక రాజకీయ నాయకురాలు, ఈమె చేసేది ఒకటే పని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని, టీడీపీ నాయకులని, జనసేన నాయకులని తిట్టడమే, అందుకే రోజాకి మంత్రి పదవి కట్టబెట్టాడు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఆమెకి, ఆమె అనుచరులకు, వారి పార్టీలో ఆశావహులకు తప్పించి ప్రజలకు అవసరం లేని విషయం ఆమె మంత్రి పదవి. దేవుడికి చేసిన పూజ వృధాగా పోదు అని పెద్దలు చెబితే విన్నాము, అలాగే రాజకీయాలలో తిట్టినా బూతులు కూడా వృధాగా పోవనమాట.రెండిటికీ తగ్గ ప్రతిఫలం దక్కుతుంది అని రోజని చూసాక అర్ధమవుతుంది.
జగన్ మోహన్ రెడ్డిగారి మొదటి మంత్రివర్గం లో మంత్రులు ఎవరో, వారు నిర్వహించిన శాఖలు గానీ, ఆ ఆ శాఖలలో వారు చేసిన కృషి గానీ ఎవరికైనా తెలుసా? ఆ మాటకి వస్తే వైసీపీ పార్టీలలో ముఖ్యమంత్రి, ఆయన సహచరులు ఇద్దరు, ముగ్గురు తప్పించి, కాకుండా ఎవరికైనా నిర్ణయాధికారాలు వున్నాయా? పార్టీలలో నాయకత్వం కోసమూ, స్వంత ప్రయోజనాల కోసమూ, అది ఒక సాంప్రదాయం మొక్కుబడి కనుకనూ, మంత్రి వర్గం వుంటోంది గానీ, దాని వలన ప్రజలకు జరిగే ప్రయోజనం కనబడటం లేదు.
రోజా 2004 నుంచే రాజకీయాల్లో ఉన్నారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజా 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009 ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్మోహనరెడ్డ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే ఆవిడది ఐరన్ లెగ్ అని ప్రచారం ఉండేది. అయినప్పటికి జగన్మోహనరెడ్డి 2014లో నగరి శాసనసభ టిక్కెట్ ఆవిడకు ఇచ్చారు. ఈసారి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే, పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. హీరోయిన్‌గా కెరీర్ ఎప్పుడో ముగించిన రోజా టెలివిజన్ షోల్లో తిరిగి పాపులర్ అయ్యారు. అసెంబ్లీలోనూ, బయటా దూకుడుగా వ్యవహరించేవారు. 2019లో తిరిగి వైసీపీ టిక్కెట్ మీద నగరిలో రెండోసారి గెలిచారు. సీనియారిటీ, ఫైర్‌బ్రాండ్ ఇమేజ్, సినిమా-టీవీ గ్లామర్ కలగలిసి రోజాను మంత్రిని చేశాయని చెప్పుకోవచ్చు.
అయితే ఈ మధ్య రోజా పనితీరుగాని, ఆమెకి ఇచ్చిన మంత్రి శాఖలోగాని పనితీరు మరి దారుణంగా తయారైందని తెలుస్తోంది, అసలు ప్రజలకి అందుబాటులో లేకుండా, టీవీల ముందు, ప్రెస్ మీట్లలో తప్పితే ప్రజలకి సేవ చేయడం ఎప్పుడో మర్చిపోయారు.నగరిలో అభివృద్ధి గురించి మాట్లాడటం పక్కన పెడితే అసలు రోజా ఇటువైపు చూడటానికికూడా ఇష్టపడటంలేదు, నగరి ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకేనా అని ఏపనులు చేయకుండా ప్రజల మీద పగబట్టింది అని నగరి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయితే రోజా పనితీరుగాని, అభివృద్ధి గాని అంతంత మాత్రమే.