ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణి దేవి కారుకు ప్రమాదం జరిగింది. కొత్తగా ఎన్నికైన ఆమె గురురువారం ఉదయం శాసన మండలికి వెళ్లింది. కారు తిరుగు ప్రయాణంలో అసెంబ్లీలోని ఒక మెయిన్ గేట్ వద్ద, అదుపు గేటును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో వాణీదేవి లేకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లయింది. అయితే వాణీదేవి కారును ఆమె గన్ మన్ డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది.
Must Read ;- మేం నేర్పిన చదువు ఇదేనా : చెల్లని ఓట్లపై వాణీదేవి కామెంట్స్