హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. శుక్రవారం సరూర్‌నగర్ కౌంటింగ్ కేంద్రాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పట్టభద్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చాలామంది పట్టభద్రులు వేసిన ఓట్లు చెల్లడం లేదని, మేం నేర్పిన చదువు ఇదేనా… అంటూ పట్టభద్రులపై అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజులుగా కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి ఆధిక్యంలో ఉన్నారు.
Must Read ;- ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 50 ప్లస్ వన్ ఫార్ములా.. అందుకే ‘ప్రాధాన్యత’ ప్రాణప్రదం