ప్రధాని మోడీ ఏడు నెలలుగా గడ్డం పెంచడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు మోడీ సారు గడ్డం ఇంతబారు ఎందుకు పెంచుతున్నారు. అనే అనుమానం ఎవరికైనా కలగక మానదు. పెద్దలు ఏది చేసినా అందులో అంతరార్థం ఉంటుంది అంటారు. ప్రధాని మోడీ ఏడు నెలలుగా గడ్డం పెంచడంపై రాజకీయ విశ్లేషకులకు భాగానే పనిపడింది
బెంగాల్ ఎన్నికల్లో గెలిస్తే గడ్డం తీస్తారా?
త్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ కే కాదు రవీంధ్రనాథ్ ఠాగూర్ విశ్వకవిగా దేశవ్యాప్తంగా, ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచ ప్రఖ్యాత కవి. బెంగాల్ ప్రజలకు ఠాగూర్ అంటే ఎక్కడ లేని అభిమానం అందుకే రాబోయే ఎన్నికల్లో ఠాగూర్ మాదిరి గడ్డం పెంచి బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీని చిత్తుచేయాలని మోడీ భావిస్తున్నారంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ రకమైన సెటైర్లూ పేలుతున్నాయి. ఏ రాష్ట్రంలో ప్రసంగం చేస్తే, అక్కడి స్థానిక భాషతో మొదలు పెట్టి జనాన్ని ఆకర్షించే ప్రధాని మోడీ, ఈ సారి ఏకంగా రవీంధ్రనాథ్ ఠాగూర్ గడ్డాన్ని కూడా అనుకరిస్తూ బెంగాలీలను మాయ చేయడనున్నారనే అంచనాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు గెలుపు ముఖ్యం. దానికి వారు దేనికైనా సిద్దపడతారనడంలో సందేహం లేదు.
అయోధ్యలో రామాలయం పూర్తయ్యే వరకు గడ్డం తీయరా?
ప్రధాని మోడీ గడ్డంపై మరికొన్ని అంచనాలు ఉన్నాయి. బీజేపీ ప్రాభవం పుట్టిందే అయోధ్య రామాలయం నినాదంతో. ఆ కల మరో మూడేళ్లలో సాకారం కానుంది. అప్పటి వరకూ మోడీ గడ్డం పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇక అది పూర్తయ్యే వరకూ గడ్డం తీయకుండా, రామాలయ నిర్మాణం పూర్తయిన తరవాత గడ్డం తీసి నేనే సాధించా అని చెప్పుకునే అవకాశం కూడా లేకపోలేదు.
AlsoRead ;- అందరూ వినండహో.. కాంగ్రెసు వారి కామెడీ!
కరోనా రాకుండా జాగ్రత్త పడ్డారా…
కరోనా వైరస్ భూతం దేశాన్ని పట్టిపీడిస్తోంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. కరోనా, లాక్ డౌన్ విధించిన తొలి రెండు మూడు నెలల పాటూ దేశంలో ఎవ్వరూ క్షవరం చేయించుకోలేదు. గడ్డం మీసాలను భరించలేని వారు, సొంతక్షవరమూ, సొంతంగానే ట్రిమ్మర్ తో గుండూ చేసుకుంటూ కాలం గడిపారు. ఆ తర్వాతే సెలూన్లు పునఃప్రారంభం అయ్యాయి.
ఆ పీరియడ్ వరకు… మోడీ కూడా అదే జాగ్రత్తల్లో ఉన్నారేమో గడ్డం ఓ అంగుళం పెరిగిందని అంతా సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ గడ్డం జానెడు అయి.. మూరెడు అయ్యే మార్గంలో ఉంది.
ప్రధాని మోడీకి ఎప్పటి నుంచో గడ్డం ఉంది. అయితే దాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయిస్తుంటారు. ప్రధాని తలచుకుంటే అత్యంత సురక్షితమైన క్షవర సేవలకు కొదవ ఉండదు. ఎవరక్కడ అంటే వంద మంది వస్తారు. కానీ ప్రధాని మోడీ గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నా సేవలకుల ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉంది. అందుకే సేవకులను ఎవరినీ దగ్గరకు రానీయడం లేదని అందుకే గడ్డం తీయడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రధాని మోడీ గడ్డం రూపంలో మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఏదైనా రాజకీయ నాయకులకు కావల్సింది ప్రచారమే కదా.
AlsoRead ;- మోడీ-జగన్ భేటీలో ముందే మీడియా లీకులెందుకు?