మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే కొలువుదీరాయి. ఎన్నికల తర్వాత… దేశానికి ముచ్చటగా మూడో సారి ప్రదాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ బుధవారం తొలిసారిగా ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖలో రాష్ట్రంలోని కూటమి సర్కారు ఏర్పాటు చేసిన బహిరంగ సభావేదికపై మోదీ తనదైైైన శైలి ప్రసంగం చేశారు. సూటిగా సుత్తి లేకుండా మోదీ చేసిన ప్రసంగం ఏపీ ప్రజల్లో ఆశలను చిగురింపజేశాయని చెప్పాలి. అంతేకాకుండా రాష్ట్రంలోని కూటమి సర్కారుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం లభించడం ఖాయమేనన్న భావన కూడా కలిగిందని చెప్పక తప్పదు. అంతేకాకుండా కూటమి సర్కారుకు సంపూర్ణ మద్దత ఇస్తామని మోదీ ఒకింత గట్టిగానే ప్రకటించారు. ఈ ప్రకటన నిజంగానే వైసీపీ అధినేత వైైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టించే ఉంటుందని చెప్పక తప్పదు.
అయినా మోదీ తన ప్రసంగంలో ఏమన్నారన్న అంశానికి వస్తే… “ఏపీ ఓ అవకాశాల గని. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే రాష్ట్రం. చిరకాల స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం, వ్యాపారం కార్యకలాపాలు పెరుగుతాయి. పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ పసురోగతికి కొత్త ద్వారాలు తెరచుకుంటాయి. ఏపీని ఆధునిక కాలపు పట్టణీకరణకు ఒక ఉదారణగా మారుస్తాం. అందులో భాగంగానే కృష్ణపట్నంలో క్రిస్ సిటీ పేరిట ఓ స్మార్ట్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం”… ఇలా సాగుతూపోయింది ప్రధాని ప్రసంగం.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మోదీ చెప్పారు. రాష్ట్రాన్ని తయారీ రంగానికి కేంద్రంగా నిలుపుతామని కూడా మోదీ తెలిపారు. ఆకాశమే హద్దుగా భారీ ప్రణాళికలు రచించుకున్న చంద్రబాబు కలను సాకారం చేసేందుకు కృషి చేస్తామనీ మోదీ ఒకింత గట్టిగానే ప్రకటించారు.
వాస్తవానికి మోదీ ప్రసంగం విన్న ఏపీ వాసులు ఎవరైనా ఆనందంతో కేరింతలు కొట్టడం ఖాయమే. అయితే తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ లాంటి వాళ్లకు అయితే ఈ మాటలు అంతగా రుచించవనే చెప్పాలి. రుచించడం అలా పక్కనపెడితే… ఈ తరహా మాటలు విన్నంతనే జగన్ లాంటి వారు హడలిపోతారు. మోదీ చెప్పినట్లుగా కేంద్రం నుంచి కూటమి సర్కారుకు సంపూర్ణ సహకారం దక్కితే… రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందితే… ఇక తాను గెలిచేదెలా? అన్నది జగన్ పాయింట్. రాజకీయంగా అదికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు గానీ… అభివృద్ధి జరగొద్దన్న రీతిలో ఆలోచించడమే పెద్ద తప్పు.
మోదీ చెప్పినట్లుగా అన్నీ అనుకున్నట్లు జరిగితే… జగన్ ఇక తన బిచాణాను ఎత్తివేయాల్సిందే. ఎందుకంటే… కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం లభించిందంటే… టీడీపీ, బీజేపీల మధ్య బంధం మరింత బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో దోస్తానాకు ఇక తిరుగే ఉండదు.మూడు పార్టీలు కలిసి మొన్నటి ఎన్నికల్లో తనను ఏ స్థాయిలో ఓడించారో జగన్ అస్సలు మరిచిపోవడం లేదట. ఈ లెక్కన మోదీ ప్రసంగం బుధవారం నాడు జగన్ కు నిద్ర లేకుండా చేసి ఉంటుందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.