ఏపీ సీఎం జగన్ ను నిర్మాత అల్లు అరవింద్ రాజులానే గుర్తించారు. రాజు తలచుకుంటే వరాలు కరవా? మా చిత్ర పరిశ్రమపై వరాలు కురిపిస్తే బాగుంటుందని విన్నవించారు. అఖిల్ హీరోగా రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హీరో అఖిల్, దర్శకుడు భాస్కర్, నిర్మాతలు బన్నీవాసు, వాసు వర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలున్నాయని, వాటిని సీఎం త్వరితగతిన పరిష్కరిస్తే మంచిదని అన్నారు.
ఈ సినిమా అక్టోబరు 15న విడుదలవుతోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే కార్యక్రమానికి హాజరుకాలేదు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అజయ్, సుధీర్, సత్యకృష్ణన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరో అఖిల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా తనకు అల్లు అరవింద్ ఒక హిట్ ఇవ్వబోతున్నట్టే తను కూడా అరవింద్ కు హిట్ ఇస్తున్నట్టు చెప్పారు. అల్లు అరవింద్ తనకు గాడ్ ఫాదర్ అన్నారు.
మన లైఫ్ బాగుండాలంటే కనీసం 9000 రాత్రులు కలిసి పడుకోవాలి. వందల వెకేషన్స్ కు వెళ్లాలి. కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడెవరు? అంటూ పూజా హెగ్డే ప్రశ్నంచే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక అఖిల్ విషయానికి వస్తే ఒక అబ్బాయి జీవితంలో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్.. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి అంటూ చెప్పే డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల ఎట్టకేలకు అక్టోబరు 15న జరగనుంది.
Must Read ;- విజయ్ ప్లేస్ లో నాగచైతన్య. ఇది నిజమేనా?











