అధికార వైసీపీ నుంచి వస్తున్నఇబ్బందులు తట్టుకుని పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అగ్రనాయకులు ప్రాధాన్యం ఇస్తుండగా.. కృష్ణా జిల్లా ముఖ్యంగా విజయవాడ టీడీపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విజయవాడ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయం కేంద్రంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. గత ఏడాది వాయిదా పడిన ప్రక్రియ నుంచే..మళ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో మార్చి 2నుంచి నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ నుంచి అనుమతి లేకుండానే ఎంపీ కేశినేని నాని తన కుమార్తె కేశినేని శ్వేత పేరును ప్రకటించారంటున్నారు. గత ఏడాది కాలంగా శ్వేత ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కేశినేని వైరి వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కేశినేని నాని పీఆర్పీలో నుంచి టీడీపీలోకి..
2009కి ముందు కేశినేని నాని పీఆర్పీలో నుంచి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి విజయవాడలో కేశినేని నానికి, ఇతర నాయకులకు మధ్య వార్ నడుస్తూనే ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా…విజయవాడ టీడీపీలో అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని నాయకులు కూడా విజయవాడలో వేలుపెడుతున్న నేపథ్యంలోనూ ఈ వివాదాలు పెరిగాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు దేవినేని ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న, బొండా ఉమ, వంగవీటి రాధ, కేశినేని నానితో పాటు ద్వితీయశ్రేణి నాయకుల మధ్య కూడా గ్రూప్ వార్ నడిచేది. అయితే పార్టీ అధికారంలో ఉం+
3డడంతో విభేదాలు పెద్దగా బయటకు వచ్చేవి కావు. తరువాతి కాలంలో పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలైంది. గతంలో పార్టీ రెండు మూడుసార్లు మాట్లాడినా కొన్నాళ్లపాటే సైలెంట్‌గా ఉండేవారు. కొంతకాలం క్రితం బుద్దా వెంకన్నకి, కేశినేని నానికి మధ్య ట్వీట్ వార్ కూడా నడిచిన విషయం తెలిసిందే.
Must Read ;- ఆగిన చోట నుంచే పురపాలికల ఎన్నికలు.. ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాల అసంతృప్తి
జనరల్ మహిళకు కేటాయించడంతో..
విజయవాడ మేయర్ జనరల్ మహిళకు కేటాయించడంతో తాజాగా పోటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కేశినేని శ్వేత తనకు తానుగా మేయర్‌గా ప్రచారం చేసుకోవడం, తనకు సంబంధించిన పార్టీ కార్యాలయానికి ఫ్లెక్సీలు వేయించడంతో ఇతర నాయకులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఈ విషయం ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వద్దకు చేరినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పదవి ఎంపికకు సంబంధించి కూడా కేశినేని నాని వర్సెస్ నాగుల్ మీరా, బుద్దా వెంకన్న, బొండా ఉమ, జలీల్ ఖాన్ మధ్య వార్ జరుగుతుండగా మేయర్ అభ్యర్థి విషయంలో ఈ విభేదాలు ముదిరాయి. పార్టీ పరంగా కేశినేని నాని పార్లమెంటు పరిధిలో ఎంపీగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పర్యవేక్షణ చేస్తే ఇబ్బంది లేదని, అయితే విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ ఇలా అన్ని నియోజవర్గాల్లోనూ తన మనుషులను పెట్టుకుని పార్టీలో పదవులు అప్పగించే యత్నం చేస్తున్నారని ఇతర నాయకులు విమర్శిస్తున్నారు. ఇక ఈ విషయంలో కేశినేని నాని వ్యతిరేక వర్గానికి దేవినేని ఉమ కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారన్న చర్చకూడా పార్టీలో నడుస్తోంది. మైలవరంలో ఓడిపోయినా..గొల్లపూడి పంచాయతీతో పాటు నందిగామ, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో దేవినేని ఉమ జోక్యం ఎక్కువైందని కేశినేని నాని వర్గం ఆరోపిస్తోంది.
పార్టీ ఇంకా మేయర్ అభ్యర్థిని నిర్ణయించలేదని బొండా ఉమ, నాగుల్ మీరా మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించడం కూడా ఈ విభేదాలున్నాయనేందుకు బలాన్నిస్తోంది. గత ఏడాది జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ శ్వేత వైపు మొగ్గుచూపించిందని అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని నాయకులు చెబుతున్నారు. దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు కలసి ఓ అభ్యర్థి పేరును ప్రతిపాదిస్తుండగా జనరల్ మహిళకు ఈ సారి రిజర్వ్ చేసినా..వేరే వర్గానికి మేయర్ పీఠాన్ని ఇస్తే ప్రజల్లో మరింత మంచి పేరు వస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకులు పార్టీ ముఖ్యనేతల వద్ద అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది. కాగా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న 10వార్డు నుంచే కేశినేని శ్వేత పోటీలో ఉండడం గమనార్హం. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. టీడీపీ నుంచి మాజీ మేయర్ సంబంధీకురాలు, ఓ సినీ నిర్మాతకు దగ్గరి బంధువు, మాజీ మంత్రి కుటుంబీకురాలు కూడా మేయర్ పోటీలో ఉండడం, ఇలా పోటీలో ఉన్నవారు భిన్న సామాజిక వర్గాలకు చెందినా అంతా ఆర్థికంగా బలంగా ఉండడంతో దేనికైనా సై అనే పరిస్థితి కనిపిస్తోంది.
Must Read ;- మేయర్‌కు అభినందన హోర్డింగ్.. జీహెచ్‌ఎంసీ ఫైన్..