వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను, సీఎం జగన్ హామీలను గుర్తుకుతెస్తూ లేఖల మీద లేఖలు సంధిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది లేఖలను రాసిన రఘురామ, మరో లేఖను సంధించారు. ఈసారి ఎన్నికల హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడం లేదని పేర్కొన్నారు. నియంత్రణ కంటే మద్యపాన వినియోగం బాగా పెరుగుతోందన్నారు. ఏపీలో గతేడాదితో పోల్చితే 16% మద్యం అమ్మకాలు పెరిగాయని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తొమ్మిదో లేఖలో డిమాండ్ చేశారు. ‘నవ హామీలు-వైఫల్యాలు’ పేరుతో రఘురామ రాజు వరుసగా తొమ్మిది లేఖలు రాశారు.
Must Read ;- రఘురామరాజును మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఏం జరుగుతోంది?