నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మరో లేఖ సంధించారు. ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సీఎంకు లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామరాజు ఇవాళ మరో అస్త్రం సంధించారు. ఏపీలో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని ఆయన లేఖలో కోరారు. 17,600 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంత వరకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన లేఖలో గుర్తు చేశారు.
ఇప్పటికైనా పనులు ప్రారంభించండి..
దాదాపు 30 లక్షల మంది పేదలు జగనన్న ఉచిత ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని ఎంపీ రఘురామరాజు సీఎం జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప ఏపీ ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తం కంటే రూ.2లక్షల అదనంగా ఖర్చు చేసి పేదలకు మొత్తం రూ.5 లక్షలతో ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తామని మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన సీఎం జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించారు.
Must Read ;- రఘురామరాజును మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఏం జరుగుతోంది?











