MP Revanth Reddy Comments on CM KCR :
సాగర్ ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధం లాంటిదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికలో భాగంగా ఆయన నాగార్జున సాగర్ పరిధిలోని పలు మండలాలు, గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. మాయమాటలు చెప్తూ, రాజకీయ పబ్బం గడుపుకునే కేసీఆర్ ను నమ్ముతారా… లేక రాజకీయ విలువల కోసం కట్టుబడిన జానా రెడ్డి పక్షాన నిలబడతారా ? అనేది తేల్చుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ కు తెలంగాణ గుర్తొకొస్తుందని, లేదంటే ఫాంహౌజ్ కు పరిమితమవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున ఉప ఎన్నిక లో నోముల భగత్ ఓడిపోతారని తెలిసి కూడా కేసీఆర్ టికెట్ ఇచ్చారని, ఒకవేళ టీఆర్ ఎస్ ఓడిపోతే నోముల భగత్ ఖాతాలో వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థ జానారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తాను చేసిన డెవలప్ మెంట్ పనులే కనిపిస్తున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున సాగర్ కు ఏం చేశాడని ప్రశ్నించారు.
Must Read ;- సాగర్ ఎన్నికల ఫలితం.. రేవంత్ అడుగులను నిర్థేశిస్తుందా?