టీడీపీ అఫిషియల్ ఫేస్ బుక్‌పై పోలీసులు ఐటీ యాక్ట్ 66, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ టీడీపీ అఫీషియల్ ఫేస్ బుక్‌లో పోస్టింగ్ పెట్టారంటూ వారిపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మూడ్రోజుల క్రితం బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కె.అనిల్ కుమార్ డీజీపీకి క్లిప్పింగులతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై డీజీపీ విజయవాడ సైబర్ క్రైమ్‌కు వివరాలు పంపించారు. ఈ కేసులో టీడీపీ అఫీసియల్ ఫేస్ బుక్ నిర్వాహకుడిని కూడా నిందితుడిగా చేర్చారు. కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్..!
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....











