తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్ బీజేపీని వీడి మళ్లీ టీఎంసీలో చేరారు. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం తన కుమారుడు సుభ్రంగ్సు రాయ్‌తో కలిసి ఆయన టీఎంసీలో చేరారు. 2017లో టీఎంసీ నుండి బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. మమతా బెనర్జీతో తనకు ఎప్పుడూ బేధాభిప్రయాలు లేవని, తిరిగి టీఎంసీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పార్టీలో చేరిన అనంతరం ముకుల్ రాయ్ మీడియాతో అన్నారు.
must read ;- ఎన్నికలు ముగిసినా తగ్గని వేడి.. మళ్లీ దీదీ VS మోదీ











