ఏపీలో శుక్రవారంతో పదవీకాలం ముగియనున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి నుంచి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు,గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి , కడప నుంచి ఆర్వీ రమేష్ యాదవ్‌లకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. వీరి నలుగురి పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కి పంపినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడ చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కి మెండి చేయి ఎదురైందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల మందు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే అభ్యర్ధి విడదల రజని విజయానికి ఆయన కృషి చేశారు.
Must Read ;- పింఛన్ల హామీ నెరవేర్చండి.. సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ రఘురామరాజు లేఖ










