క్రికెట్ రారాజు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారిగా ఐపీఎల్ వేలంలో పాల్గొన్నారు. అతడిని ఎవరు తీసుకుంటారు?ఎంత మొత్తం ధర పలుకుతాడనే విషయాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే.. చివరికి రూ.20 లక్షలకు ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది.
సిద్ధమైన అర్జున్ టెండూల్కర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో సందడి చేసేందుకు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సిద్ధమయ్యారు. ఐపీఎల్ వేలంలో తొలిసారిగా పేరు నమోదు చేసుకున్నారు. ముంబయి ఇండియన్స్ అర్జున్‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని అందరూ భావించారు. కానీ.. అతడిని కొనుగోలు చేయడానికి ఎవరూ ఎక్కువ శ్రద్ధ చూపలేదు. ఎడమచేతి వాటం పేస్ బౌలర్ అయిన అర్జున్.. వికెట్లు తీయడమే కాకుండా భారీ సిక్సర్లూ బాదగలరు. గతంలో టీమిండియా మహిళల జట్టు, ఇతర జట్లకు అతడు నెట్స్‌లో బౌలింగ్ చేశారు.

క్రికెట్ నీ రక్తంలోనే ఉంది..
అర్జున్ టెండూల్కర్‌ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయడంపై అతని సోదరి సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టా స్టోరీస్‌లో అర్జున్ బౌలింగ్ చేస్తున్న ఫొటోను పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. క్రికెట్ నీ రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నావు.. అని సారా పేర్కొంది.
Must Read ;- ఐపీఎల్ 2021: యువీ రికార్డు బద్దలు.. మోరిస్ @ రూ.16.25 కోట్లు











