తెలుగులో లవర్ బాయ్ గా నాగశౌర్యకి మంచి క్రేజ్ ఉంది. మంచి ఒడ్డూ పొడుగుతో ఆకర్షణీయమైన రూపంతో కనిపించే నాగశౌర్యకి అమ్మాయిల్లోను మంచి క్రేజ్ వుంది. వరుసగా ప్రేమకథా చిత్రాలు విజయవంతమవుతూ రావడంతో, యూత్ లో ఆయన ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. అలా ‘ఊహలు గుసగుసలాడే’ .. ‘దిక్కులు చూడకు రామయ్య’ .. ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు, మిగతా యువ కథానాయకుల పోటీని తట్టుకుని ఆయన నిలబడేలా చేశాయి. ఇక ఆ తరువాత వచ్చిన ‘ఛలో’ సినిమా, నాగశౌర్య కెరియర్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేసింది.
‘ఛలో’ సక్సెస్ తో ఉక్కిరిబిక్కిరైన నాగశౌర్య, ఆ తరువాత కథల ఎంపిక విషయంలో తడబడ్డాడు. ‘నర్తనశాల’ కథను ఎంచుకోవడం ఆయన చేసిన పెద్ద పొరపాటు. ఆ తరువాత యాక్షన్ హీరోగా కూడా మంచి మార్కులు కొట్టేయాలనే ఆత్రుతతో ఆయన రిస్క్ చేశాడు. ఆ సినిమాల పరాజయాలతో ఆయన కాస్త డీలాపడ్డాడు. ఆ తరువాత కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.
Must Read: Tollywood Celebs at AHA Event.
ఈ నేపథ్యంలోనే ఓ పెద్ద బ్యానర్లో చేసే అవకాశం నాగశౌర్యకి వచ్చిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఓ విభిన్నమైన కథా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆయన నాగశౌర్యను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. కొత్తగా పరిశ్రమకి వచ్చిన ఓ యువ దర్శకుడికి ఈ ప్రాజెక్టు బాధ్యతను అప్పగించారని అంటున్నారు.
ఈ సినిమాలో ప్రాధాన్యతను కలిగిన ఒక గెస్టు రోల్ ఉందట. ఆ పాత్రను మంచి క్రేజ్ వున్న సీనియర్ హీరో చేస్తే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు, సీనియర్ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పుకుంటున్నారు. లాక్ డౌన్ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వారు తిరిగి బిజీ అవుతున్న ఈ సమయంలో, ఆ గెస్టు రోల్ కి ఏ సీనియర్ హీరో ఒప్పుకుంటాడో చూడాలి మరి.
Also Read: ఆరుపలకల దేహంతో అదరగొడుతోన్న అశ్వథ్థామ











