కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు ఎనలేని సేవలు చేస్తోంది. ఇప్పటికే ఏపీలో నాలుగు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఎన్టీఆర్ ట్రస్టు సేవలకు మంచి పేరు వస్తుండటంతో తెలంగాణలో రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఇప్పటికే టెలిమెడిసిన్, కరోనా రోగులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. కరోనా రోగులు ట్రస్టు సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Must Read ;- అనాధ శవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అంతక్రియలు : నారా భువనేశ్వరి