సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది. దాంతో పాటు సినిమా విడుదల కూడా వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే సినిమా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహేశ్ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న మూడో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. లాస్టియర్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతోనూ, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతోనూ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా మీద ఎంతో ఆసక్తితో ఉన్నారు అభిమానులు. ఇక ఈ సినిమాను పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించే ప్రయత్నంలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం. అలాగే.. ఈ సినిమాకి పార్ధు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి.
నిజానికి కృష్ణ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదలవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేశ్ బాబు వద్దని చెప్పాడట. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనే విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే నెల్లోనే సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల వారి భోగట్టా. ఒక పక్క సర్కారు వారి పాట సినిమాలో నటిస్తునే మరో పక్క త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట మహేశ్. మరి ఈ సినిమా మహేశ్ , త్రివిక్రమ్ కెరీర్స్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Must Read ;- హీరో కృష్ణపై ఊర్వశి ఓటీటీ ప్రత్యేక పాట