కాంతా లగా అనగానే అందరి మదిలో తళుక్కున మెరిసే సుందరి షెఫాలీ జరివాలా. ఖరీదైన కురచ దుస్తుల్లో మెరిసిపోతూ ఫోటోలు షేర్ చేస్తుంటే అభిమానులు ఫిదా అయిపోరూ. ఫ్యాషన్ గురించి మాట్లాడాల్సి వస్తే షెఫాలీ జరివాలా తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. అసలు బాలీవుడ్లో ఎందరు హీరోయిన్లు ఉన్నా తనకంటూ పేజీని సృష్టించుకోవాలని ఈ సుందరి తాపత్రయం. మాజీ బిగ్ బాస్ స్టార్ షెఫాలీ జరివాలా ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. బిగ్ బాస్ 13 సీజన్లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కన్నా ముందు ఈ భామ నాచ్ బలియేలో తన భర్త పరాగ్ త్యాగితో కలసి పాల్గొంది. వేసవిలో ప్రత్యేక తరహా దుస్తుల్లో ట్రెండ్ సెట్ చేయాలని తాపత్రయపడుతుంటుంది. ఇలాంటి దుస్తులైతే చాలా తేలికగా ఉంటాయి. పారదర్శకంగా ఉంటాయి. ఇక వీటిలో గ్లామర్ డోస్ పెంచటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన స్టన్నింగ్ ఫొటోలు, అదిరే కాస్టూమ్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
వేసవిలో కాటన్ దుస్తులు తనకు చాలా కంఫర్ట్ గా ఉంటాయని చెబుతోంది. డిజైనర్లు మాత్రం ఈ భామకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ తయారుచేసి తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంకా చోప్రా సినిమా ముజ్సే షాదీ కరోగీలో ఓ ప్రత్యేక పాత్రను కూడా పోషించింది. ప్రస్తుతం ఈ భామ కరోనా సమయం కాబట్టి భర్త పరాగ్ త్యాగితో చక్కగా ఎంజాయ్ చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 19 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇందులో మాత్రం క్రమం తప్పకుండా అప్ డేట్స్ ఇస్తుంటుంది.
Must Read ;- ఈ భామ రచ్చ చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోరేం?











