తెలుగుదేశం పార్టీ స్టైల్ దేశ రాజకీయాల్లో డిఫరెంట్. అన్న ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించడం నుంచి
ఇప్పటి దాకా టీడీపీ ప్రత్యేకతలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. వాటన్నింటి సంగతెలా ఉన్నా తెలుగుదేశం పార్టీ నుంచి 2024 ఎన్నికల ముందు మరో ఆసక్తికరపరిణామాన్ని నిస్సందేహంగా తెలుగు ప్రజలు చూడబోతున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రికి ముహూర్తం ఫిక్సయినట్టే అనిపిస్తోంది.
గతంలో నారా బ్రాహ్మణి నాన్న బాలకృష్ణ తరపున హిందూపురంలోనూ, భర్త లోకేశ్ కోసం మంగళగిరిలోనూ ప్రచారం చేశారు. అయితే అప్పట్లో పార్టీ కోసం ఆమె పార్ట్ టైమ్ ప్రచారం చేశారు. కానీ
ఈ సారి మాత్రం బ్రాహ్మణి ఫుల్ టైమ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఈ సారి తెలుగుదేశానికి కొత్త ఉత్సాహం తెచ్చిపెడుతుందని టీడీపీ నేతలు ఖుషీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టయ్యాక లోకేశ్ తో కలసి ఆమె చకచకా పార్టీ వ్యవహారాలు చక్కదిదద్దడం
ప్రారంభించటం అనూహ్య పరిణామం అయినా…. అందరితో కలసిపోతూ కేడర్ తోనూ,నేతలతోనూ ఆమె సమన్వయం చేస్తున్న తీరుపై పార్టీలో సీనియర్ పొలిటిషియన్లు సైతం ఆశ్చర్యపడేలాచేస్తోంది. ఢిల్లీలో భర్త లోకేశ్ జాతీయ నేతలతో చర్చలు జరుపుతుంటే… భువనేశ్వరితో కలసి బ్రాహ్మణి సీనియర్ రాజకీయ నేతలను తలపించేలా చంద్రబాబు అరెస్ట్ పై తమ ఆందోళనను ప్రజల్లోకిబలంగా తీసుకెళ్లగలిగారు.
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నప్పటికీ ఆ లోటు కనపడనీయకుండా చేస్తోన్న బ్రహ్మణి తెలుగుదేశం
పార్టీకి2024 ఎన్నికల్లో ఓ వజ్రాయుధమవుతుందని పార్టీ కేడర్ అంతా నమ్మేలా రకరకాల కార్యక్రమాలతో
చంద్రబాబు అరెస్ట్ పై తమ నిరసనను బలంగా తెలియచేయడంలో సక్సెస్ అవడంతో పాటు కేడర్ ఉత్సాహం కోల్పోకుండా కాపాడటంలోనూ నారా బ్రాహ్మణి సూపర్ సక్సెస్ అయ్యారు. అనుకోకుండా
వచ్చినా..ఆలస్యంగా వచ్చినా బ్రహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఫిక్సయిపోవడంతో కొత్త ఉత్సాహంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె వెన్నంటే ఉంటామంటూ ప్రకటిస్తుండం ఆసక్తికర పరిణామం. కార్యకర్తలు ఆశిస్తున్నట్టే బ్రాహ్మణి కూడా నేతతో ఎప్పటికప్పుడు వ్యూహ రచన చేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
ఇదే ఉత్సాహంతో భర్త లోకేశ్ కలసి బ్రాహ్మణి యువగళం పాదయాత్రలోనూ పాల్గొనబోతున్నారట. 2024ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన ప్లస్ పాయింట్ కాబోతున్న యువగళం పాదయాత్రకు
బ్రాహ్మణి కూడా తోడైతే తిరుగే ఉండదని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు జగన్ బ్యాచ్‌ను పడగొట్టాలంటే తొడగొట్టి సవాల్ విసిరే బాలయ్య కుటుంబానికి చెందిన బ్రాహ్మణి ఎన్నికల బరిలో దిగితే ఎదురే ఉండదని ఓ నిర్ణయానికొచ్చేశారు. అంతే కాదు అందరికంటే ఓ అడుగు ముందుకేస్తూ బ్రాహ్మణికి ఫలానా చోట టిక్కెట్ ఇస్తే బావుంటుందంలూ నాలుగైదు నియోజకవర్గాల పేర్లను కూడా హై కమాండ్ కు చెప్పారట. అటు వపన్ కళ్యాణ్ పార్టీ పొత్తు ప్రకటించడం.. ఇటు బ్రాహ్మణి దూకుడు మునుముందు పార్టీకి సానుకూల అంశాలుగా మారతాయన తెలుగుదేశ పార్టీ విశ్వసిస్తోంంది. ఇక అన్నీ కలిసొచ్చే అంశాలే కాబట్టి 2024 ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేయటమే వ్యూహంగా అడుగులు ముందుకేస్తోంది . బ్రాహ్మణి తొలి అడుగే మోత మోగేలా సూపర్ హిట్ అయిందని టీడీపీ కేడర్ బలంగా నమ్ముతోంది.