ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వాల్యుయేషన్ పై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. డిజిటల్ వాల్యుయేషన్ పై జోక్యం చేసుకొని న్యాయం చేయాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకొని అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని కోరారు. ఏపీపీఎస్సీ పై నిరుద్యోగ యువతకు తిరిగి నమ్మకం కలిగేలా ప్రక్షాళన చేయాలని నారా లోకేశ్ కోరారు.
Must Read ;- ఏపీపీఎస్సీని అవినీతి మయం చేశారు : నారా లోకేష్