వైఎస్పార్సీపీ అధికారిక వెబ్ సైట్ నుంచి తన పేరు తొలగించడంపై ఎంపీ రఘురామరాజు పార్టీ అధ్యక్షుడు జగన్‌కు లేఖ రాశారు. పొరపాటున తొలగించారా లేక పార్టీ నుంచి బహిష్కరించారో 48 గంటల్లో తెలపాలంటూ ఆయన లేఖలో కోరారు.రాజ్యసభ, లోక్‌సభలో మొత్తం వైఎస్పార్సీపీకి ఉన్న 28 మంది పార్లమెంట్ సభ్యుల పేర్లను గతంలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఎన్నికయిన డాక్టర్ గురుమూర్తి పేరును జాబితాలో చేర్చారు. సవరించిన జాబితాలో ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు లేకపోవడంతో ఆయన స్పందించి జగన్‌కు లేఖ రాశారు, ఒక వేళ పార్టీ నుంచి బహిష్కరిస్తే తనను స్వతంత్ర సభ్యునిగా పరిగణంచాలంటూ ఆయనకు స్పీకర్‌ను కోరే అవకాశం ఉంది. అంతేగాక వైఎస్పార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేసిన ఆయన పార్లమెంటు సభ్యత్వ అనర్హత విషయానికి కూడ ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.
Must Read ;- జగన్ ఢిల్లీ టూర్.. దేశ వ్యాప్తంగా రచ్చకెక్కిన రఘురామ ఎపిసోడ్











