స్టార్ కిడ్ చెడ్డీ ధరించినా వార్తే అయిపోతోంది. పైగా ఆ చెడ్డీ ధరపై బోలెడు అంచనాలు. అలాంటి ఓ స్టార్ కిడ్ హీరోయిన్ గా జనం ముందుకు రాబోతోంది. ఇది బాలీవుడ్ లోనండోయ్. స్టార్ కిడ్స్ బాలీవుడ్ లో రాణించినంతగా ప్రాంతీయ భాషల్లో రాణించడం లేదు. పుత్రులు కాదండోయ్.. పుత్రికలు. బాలీవుడ్ లో ఎందరు హీరోయిన్లు సినీ వారసులుగా అడుగుపెట్టారో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఆలియా భట్ హవా ఎలా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరో స్టార్ కిడ్ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. ఆమె మరెవరో కాదు సంజయ్ కపూర్ పుత్రికా రత్నం శనన్యా కపూర్. కరణ్ జొహార్ ఈమెను తెరకు పరిచయం చేయబోతున్నారు.

సంజయ్ కపూర్ అనగానే హిందీ చిత్రం రాజా గుర్తుకు వస్తుంది. అనిల్ కపూర్ సోదరుడిగా హీరోగా వెండి తెరకు పరిచయమై చాలా సినిమాలు చేసినా చివరికి రెస్ట్ తీసుకోవల్సి వచ్చింది. ఆయన వారసురాలిగా శనన్య రంగ ప్రవేశం చేయనుంది. ఈ బ్యూటీ ఈ మధ్య తన బికినీతో వార్తల్లోకి ఎక్కింది. ఈ బికినీ ధర తెలిస్తే షాకేనంటున్నారు. సినిమా రంగంలో ఫ్యాషన్ డిజైనర్లకు ఉండే డిమాండు మరెవరికీ లేదు. శనన్యకు ఇలాంటి డిజైనర్లంటే మక్కువ ఎక్కువ. కొన్ని దుస్తుల్ని ఎంచుకుని తన వాటిని స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటుందట.
అలా ఆమె ఈ మధ్య డిజైన్ చేయించుకున్న ఓ బికినీ మీద అమాంతం క్రేజ్ ఏర్పడింది. ఆమె తరచూ తను ధరించిన దుస్తుల్లో ఫొటోకు పోజిచ్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. పైగా ఆమె హాట్ ఫొటోలతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంటుంది. ఈ గ్లామర్ షోలో భాగంగా ఈ బికినీ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ బికినీ టాప్ ఖరీదు రూ. 50 వేలు ఉంటే, కింది బాగం ధర రూ. 40 వేల వరకూ ఉంది. ఈ బికినీకి చెల్లించిన డబ్బులతో రెండు తులలా బంగారం కొనుక్కోవచ్చు కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
వేరే అమ్మాయిలైతే ఆ పనే చేసేవారు. ఆ ఫొటోల్లో దుస్తులు సింపుల్ గానే ఉన్నా వాటి ధర మాత్రం దండిగానే ఉంటుందట. మంచి సినిమా చేతిలో పడాలేగాని ఈ ధర వారికి ఓ లెక్కా. అయినా సినిమా వారసులే కాబట్టి ఈపాటికే తండ్రి బాగా సంపాదించేసి ఉంటారు. కరోన్ జొహార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే లోపే మరన్ని సినిమాల్లో అవకాశాలు సంపాదించేయాలన్న ఆత్రం ఆమెలో ఎక్కువగా ఉంది. చూడాలి బాలీవుడ్ ఈమెకు రెడ్ కార్పెట్ పరుస్తుందో లేదో.
Must Read ;- డాటరాఫ్ అతిలోక సుందరి.. కేరాఫ్ మాల్దీవులు











