ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా టీడీపీ కార్యకర్తలను ఓ అంశం ఇంకా వేధిస్తోంది. అది కొడాలి నాని. వైసీపీ సర్కార్ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన చీఫ్ పవన్‌లను నోటికొచ్చినట్లు తిట్టిన కొడాలి నాని ఇంకా స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. అంతే కాదు వైసీపీ హయాంలో గుడివాడ నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు నానిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఐతే అనారోగ్య కారణాలు చూపిస్తూ నాని ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. నిజానికి వల్లభనేని వంశీతో పోలిస్తే కొడాలి నాని అరాచకాలే ఎక్కువ.
ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై నమోదైన కేసులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. విశాఖలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో అరెస్టు ఉండకపోవచ్చు. కానీ విచారణకు హాజరు కావాల్సిందే. గుడివాడలో రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దా*డి కేసు, గుడివాడలో వార్డు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించినందుకు IPC సెక్షన్ల 447, 506, R/w 34 కింద కేసు వంటివి ఉన్నాయి. ఐతే చాలా కేసుల్లో ముందస్తు బెయిల్స్ వచ్చాయి. గుడివాడలో చేసిన అరాచకాలు, దోపిడీలపై ఇప్పటికే విచారణలు పూర్తయ్యాయి. వాటి రిపోర్టులు రెడీగా ఉన్నాయి. ఆ కేసులు ఇంకా పెట్టలేదు.
గుడివాడలో నాని అక్రమాలు, అరాచకాలు అడ్డే లేదు. వైసీపీ హయాంలో మరింతగా రెచ్చిపోయింది నాని గ్యాంగ్. గడ్డం గ్యాంగ్ పేరుతో ఇష్టారీతిన దోచుకున్నారు. అడ్డొస్తే దా*డులు చేశారు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. హార్ట్ ఆపరేషన్ పేరుతో నాని హాస్పిటల్‌కు వెళ్లకపోతే ఇప్పటికే ఆయన జైలు ఊచలు లెక్కపెడుతుండేవారు. కానీ టైం ఇచ్చారు. ఇప్పుడు నాని టైమొచ్చింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ నాని ముందు,వెనకా చూసుకోలేదు. ఇష్టారీతిన అప్పటి ప్రతిపక్షం టీడీపీ నేతలపై నోరు పారేసుకున్నారు. ఇప్పటికైనా నానికి బుద్ధి చెప్పకపోతే ప్రభుత్వానికి చేత కావట్లేదన్న మెసేజ్ కార్యకర్తల్లోకి వెళ్తుంది. ఐతే చట్ట ప్రకారం పకడ్బందీగా నానిపై చర్యలకు కూటమి సర్కార్ సిద్ధమైంది











