వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ ఇన్‌సెక్యూరిటీ ఫీలవుతున్నారని, అందుకే ఆయన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. నిజానికి జగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎం..కాబట్టి ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది. ఐనప్పటికీ ప్రభుత్వ కల్పించే పోలీసులను పక్కన పెట్టేసి జగన్ రెడ్డి తన సెక్యూరిటీ కోసం ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నారు. ఏకంగా 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం డోన్ పర్యటన నుంచి ఈ ప్రైవేట్ సైన్యం రంగంలోకి దిగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే ప్రస్తుతం ఆయనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ప్రైవేట్ సైన్యాన్ని అనుమతిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి జగన్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ఆందోళనలు లేవు. ఏ నిఘా వర్గాలు సైతం జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని నివేదికలు ఇవ్వలేదు.
మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు 58 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. వీరిని కాదని ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే రావడంతో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయినప్పటికీ ..మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రభుత్వం Z+ సెక్యూరిటీ కల్పించింది.ఇందులో భాగంగా 58 మంది పోలీసులు జగన్‌కు రక్షణ కల్పిస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడిగా ఆయన తన పర్యటనల వివరాలను పోలీసులకు ఎప్పటికప్పుడు జగన్ తెలియజేయాలి. సెక్యూరిటీ ఏర్పాట్లు వారే చేపట్టాలి.
పోలీసు భద్రతా నియమాలను జగన్ పక్కనపెట్టడానికి వీల్లేదు. అయితే ఇటీవల జగన్ ఎక్కడ పర్యటించినా భద్రతాపరమైన మార్గదర్శకాలన్నింటినీ ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు అనుమతించిన సంఖ్యలో కాకుండా..పథకం ప్రకారం వేల సంఖ్యలో జనాలను రప్పిస్తున్నారు. తన ముందు నడవాలంటూ నేతలు, కార్యకర్తలకు సైగలు కూడా చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్దకు పెద్దసంఖ్యలో రావాలని సూచిస్తున్నారు. తమను అడ్డగిస్తున్న పోలీసులను వైసీపీ కార్యకర్తలు తోసుకుని మరీ వెళ్తున్నారు. దీంతో తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని జగన్ ఆరోపణలు చేస్తున్నారు.
కార్యకర్తలను అడ్డుకుంటే.. ఎవరూ తనను కలవకుండా ఆంక్షలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. బంగారుపాళ్యం పర్యటన తర్వాత..జగన్ అమలు చేస్తున్న ప్రణాళికలపై పోలీసులకు స్పష్టత వచ్చింది. భద్రతను ఛేదించుకుని ఎవరూ రాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇటీవల జగన్ నెల్లూరు పర్యటన సమయంలో కార్యకర్తల హడావుడి తగ్గింది. ఈ పరిస్థితుల్లో జగన్ ప్రైవేటు సైన్యాన్ని నియమించుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరిదని పోలీసువర్గాలూ ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం సరైన రక్షణ కల్పించడం లేదని ప్రచారం చేసుకునేందుకే బౌన్సర్లను తెచ్చుకుంటున్నారని రాజకీయవర్గాలు విమర్శిస్తున్నాయి.
ఇక లిక్కర్ స్కామ్‌లో అరెస్టు భయం జగన్‌ను వెంటాడుతోంది. ఈ కేసులో జగన్‌ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన చుట్టూ ప్రభుత్వ పోలీసుల రక్షణ ఉంటే..అరెస్టు చేయడం సులువు అవుతుందని, అదే ప్రైవేట్ సైన్యం ఉంటే రచ్చ చేయొచ్చనేది జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది











