ఓ కలెక్టర్ సోనూ సూద్ కు లేఖ రాయడం.. సోనూ సూద్ స్పందించకుండా ఉండటమూ ఎలా జరుగుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ రాసిన ఓ లేఖను సోనూ వెంటనే స్పందించారు. నిజమే సోనూ రియల్ హీరో అంటూ ఆ కలెక్టర్ కూడా ఆయన్ని పొగుడుతున్నారు. విషయమేమిటంటే నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని, ఈ విషయంలో ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాశారట.
కలెక్టర్ నుంచి లేఖ అందుకున్న సోనూసూద్ రూ. 1.5 కోట్ల విలువైన ఆక్సిజన్ జనరేటర్ ను అందిస్తానని ఆయనకు హామీఇచ్చారు. ఈ జనరేటర్ కు రోజూ 2 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి విషయంలో సోనూ జాప్యం అసలు చేయడు కదా. మరో రెండు రోజుల్లో ఈ జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ వచ్చేస్తుందట. సోనూ చేసిన ఈ సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అభినందిస్తున్నారు.
Must Read ;- అభిమానిని లంచ్ కు ఆహ్వానించిన సోనూ సూద్