కరోనా సెకండ్ వేవ్ లో ప్రజల్ని ఆదుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విరాళాలు ఇవ్వడానికి హీరోలు వరుసగా క్యూకడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ రూ. 50 లక్షలను ముఖ్యమంత్రి స్టాలిన్ కు అందజేశారు. హీరోలు సూర్య, కార్తి కోటి రూపాయలు, అజిత్ రూ. 25 లక్షలు, శివకార్తికేయన్ రూ. 25 లక్షలు చొప్పున చెక్కులను ముఖ్య మంత్రి స్టాలిన్ కు అందజేశారు. నిర్మాత ఎడిటర్ మోహన్ తన కుమారులు జయం రవి, జయం రాజాలతో వెళ్లి రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు.
కోలీవుడ్ పరిశ్రమకు చెందిన అనేక మంది నటులు, సాంకేతిక నిపుణలు కూడా కరోనా బారిన పడి మృతిచెందారు. దీంతో బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. ఇంకా ఇతర హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తే బాగుటుందని పలువురు సూచనలు చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ వెనకబడి ఉంది. ఇక్కడ మీనమేషాలు లెక్కించేవారే కనిపిస్తున్నారు.
టీఎన్ ఆర్ అనే జర్నలిస్టు చనిపోతే మెగాస్టార్ చిరంజీవి రూ. లక్ష విరాళంగా పంపించారు. కరోనా బాధితుల్ని ఆదుకునే విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే ఇలా ఆలోచించడం కన్నా త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లడం మంచిదని చాలామంది సూచిస్తున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి సూచనల మేరకే అందరూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
Must Read ;- ఈ తెలుగమ్మాయి.. రియల్ హీరో సోనూకే హీరో!











