ఏలూరులో వింత వ్యాధి మరోసారి కలకలం సృష్టించింది. ఏలూరు నగరంలోని శనివారపుపేటలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. నోటి వెంట నురగలు కక్కుకుంటూ పడిపోవడంతో బంధువులు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వింతవ్యాధి అదుపులోకి వచ్చిందనుకుంటున్న సమయంలో మరోసారి బయటపడటంతో ఏలూరు జనం బెంబేలిత్తి పోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఏలూరు ప్రజలు బంధువుల గ్రామాలకు తరలి వెళ్లారు. ఈ వ్యాధి తగ్గిపోయిందన్న వార్తలతో ఇప్పుడిప్పుడే వారు తిరుగు ప్రయాణం అవుతుండగా మరల కేసులు బయటపడటం కలకలం రేపింది. దీనిపై వైద్య అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు.
Must Read ;- ఏలూరు వింత వ్యాధిపై సర్కారు విచిత్ర వాదన..!