పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తుండడం తెలిసిందే. ఆయన ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే.. వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కి ఓకే చెప్పారు. పవన్ ఈ సినిమాకి ఓకే చెప్పడం చాలా మందికి అర్ధం కాలేదు. కారణం ఏంటంటే.. ఇందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంది. మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? అనుకున్నారు. అయితే.. ఈ రీమేక్ లో మరో హీరో పాత్రను ఎవరు చేస్తారు అంటే దగ్గుబాటి రానా పేరు వినిపించింది.
ముందుగా ఈ రీమేక్ ని వెంకీ – రానా కాంబినేషన్ లో చేయాలనుకున్నారు. ఆతర్వాత వెంకీ – రవితేజ కాంబినేషన్ తెర పైకి వచ్చింది. ఆతర్వాత ఈ కథ గురించి తెలిసి పవన్ ఈ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించడంతో పవన్ తో కలిసి నటించే మరో హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ముందుగా దగ్గుబాటి రానా పేరు వినిపించింది అయితే.. ఈ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేసారు కానీ.. రానా పేరు ప్రకటించలేదు. దీంతో రానా నో చెప్పారా..? అలా కాకపోతే ఎందుకు రానా పేరు ప్రకటించలేదు అనేది హాట్ టాపిక్ అయ్యింది. అప్పుడు పవన్ తో కలిసి నటించే హీరో అంటూ నితిన్ పేరు వినిపించింది.
Must Read ;- టీజర్ టాక్ : దగ్గుబాటి రానా ‘విరాటపర్వం’ ఫస్ట్ గ్లింప్స్
నితిన్ పవన్ కళ్యాణ్ వీరాభిమిని. పవన్ – నితిన్ కాంబో కన్ ఫర్మ్ అనుకున్నారు. ఆతర్వాత పవన్ సినిమాలో నటించే హీరో అంటూ నాని, సుదీప్ ఇలా కొంత మంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… పవన్ తో కలిసి ఈ సినిమాలో దగ్గుబాటి రానా నటించనున్నారని ఈ రోజు సితారా ఎంటర్ ప్రైజెస్ వారు ట్విట్టర్ వేదికగా అఫిషియల్ గా ప్రకటించారు. అంతేకాదు .. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read ;- త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్టు అల్లు ‘రామాయణం’
The epic journey begins today! We welcome the Mighty Bhallaladeva @RanaDaggubati to join our Powerstar @PawanKalyan garu for our Production No 12! 🤩
▶️ https://t.co/m8Laq8bivw#RanaJoinsPSPK @MusicThaman @saagar_chandrak @vamsi84 @SitharaEnts
— Sithara Entertainments (@SitharaEnts) December 21, 2020