(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
పర్యాటక శాఖ అభివృద్ధికి కొత్త పాలసీ ప్రవేశపెట్టినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం విశాఖపట్నంలో ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలసీలు లేని కారణంగానే ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకు రాలేక పోయారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా, ఫైవ్, సెవెన్ స్టార్ హోటల్స్ ను మెగా ప్రాజెక్టుల కింద అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. లీజులు, అనుమతుల విధానం లో సరళీకరణ కారణంగా రాబోయే రోజుల్లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 200 కోట్ల రూపాయల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త పాలసీ టూరిజం ఫ్రెండ్లీ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.
Must Read ;- అనుకోని అతిధి శాశ్వతంగా విశాఖ ఒడ్డునే .. పర్యాటక కేంద్రంగా మార్పు ?