మార్వెల్ ప్రపంచంలోకి మరోసారి ప్రయాణం చేయబోతున్నామా? మార్వెల్ రూపొందించిన ‘బ్లాక్ విడో’ వచ్చే జులై 9న అటు థియేటర్లలోనూ, ఇటు డిస్నీప్లస్ ఓటీటీలోనూ విడుదల కాబోతోంది. అందుకే ఈ సినిమా కొత్త ట్రైలర్ ను మార్వెల్ విడుదల చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నాలుగో దశలో బ్లాక్ విడో మొదటి చిత్రం. వాస్తవానికి ఇది గత ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావలసి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు.
మార్వెల్ ఏ విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. డిస్నీప్లస్ లో ‘వాండావిజన్’, ‘ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్’లను అందుబాటులో ఉంచింది. ‘లోకి’ని జులై 11న విడుదల చేయబోతోంది. అలాగే ‘బ్లాక్ విడో’ విడుదల తేదీని జులై 9గా ప్రకటించింది. బ్లాక్ విడోని మాత్రం ఓటీటీతోపాటు థియేటర్లలోనూ విడుదల చేసే ఉద్ధేశంతో ఉంది. ఏప్రిల్ 28 సూపర్ హీరోల దినోత్సవం కావడంతో కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది.
స్కార్లెట్ జోహన్సన్ ఏమంటారు?
బ్లాక్ విడోలో టైటిల్ పాత్రను స్కార్లెట్ జోహన్సన్ పోషించాను. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణి ఆమె. ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా తన అభిమానులతో కొన్నిఅనుభవాలను ఆమె పంచుకుంది. ‘ఈ సినిమాలో నటాషా రొమానోవా గురించి మీకు తెలిసింది తక్కువే. అమెరికన్ కామిక్ బుక్ హీరోయిన్ గా పాపులర్ పాత్ర ఇది. ఎవెంజర్స్ ను కలిపే సమయం వచ్చినప్పుడు షీల్డ్ ను ఎవరు పిలిచారు? కేజీబీ సభ్యుడు, షీల్డ్ ఏజంటు, అవెంజర్ లు న్యూయార్క్ యుద్ధంలో పోరాడారు.
వింటర్ సోల్జర్ తో పోరాడారు. అల్ట్రాన్ నుంచి ప్రపంచాన్ని రక్షించారు. స్లోవేకియా ఒడంబడికలపై సంతకాలు చేశారు. థానోస్ దళంతో పోరాడారు’ అని వివరించారు. సివిల్ వార్ లో అసలైన అవెంజర్ ఎవరో తెలియజెప్పబోతున్నారట. అవెంజర్స్ ప్రవర్తనపై మనం ఇప్పటికే ఓ అంచనాకు రావచ్చు. కాప్, ఐరన్ మ్యాన్ లు కూడా బ్లాక్ విడోకు సాటిరారట. ఈ బ్లాక్ విడోనే సరైన పాత్ర అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి.











