July 5, 2026 4:10 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

పండువెన్నెల ‘చంద్ర’ కళ.. నెరవేరిన ‘రంగుల’ కల!

ఆ ‘చంద్ర’ కళ ఇక కనిపించదు.. ఆయన కలను నెరవేర్చుకున్నారు.. కాలంలో కలిసిపోయారు. కళకు వన్నె తెచ్చిన మరో బాపు మనకిక లేరు.ఆ చంద్ర తారార్కం ఆయన కళ మాత్రం నిలిచిపోతుంది.

April 29, 2021 at 1:17 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘అమ్మ’ ఓ కమ్మని మాట.. మరి బొమ్మ.. కల(ళ)ల బాట. బొమ్మ అనగానే బాపు గుర్తొస్తారు.. ఆ తర్వాత ఇంకెవరు అంటే చంద్ర తప్ప మరో మాట వినపడదు. చిత్ర కళా ప్రపంచానికి బాపు సూర్యుడైతే చంద్ర ఓ పున్నమి చంద్రుడు. పున్నమి రోజున పుట్టడం వల్లనేమో ఆయన పున్నమి చంద్రుడిలా ‘వెలిగి’పోయారు. చంద్ర లేరని తెలిసి కుంచె కూడా కన్నీళ్లెట్టుకుంటుందేమో.

చంద్ర అసలు పేరు మైదం చంద్రశేఖర్. సొంతూరు వరంగల్ జిల్లా ధన్నాసరి. ఆయనలో అనేక కళలున్నాయి. చిత్రకారుడు, రచయిత, కళాదర్శకుడు, కార్టూనిస్ట్, కథకుడు, నటుడు.. మంచి మనీషి. ఈయన కళ నచ్చి బి. నరసింగరావు తన ‘రంగుల కల’లో ఆర్టిస్టు పాత్రనే ఇచ్చారు. చంద్ర కాన్వాసు మీద వెలిగిపోయిన బొమ్మలు ఒకటా రెండా వేలకు వేలు. ఎవరైనా కథ రాస్తే చంద్ర బొమ్మ ఉండాల్సిందే. అప్పట్లో అనేక పత్రికలకు ఆయనే ఆస్థాన చిత్రకారుడు.. ఆ స్థానం భర్తీ చేయలేని కలం వీరుడాయన. ‘చూపుల ద్వారా స్వాహా చేసి దృశ్యాలను వేళ్ళ చివర్ల కుంచెల ద్వారా ప్రపంచాల అంచుల వరకూ విసిరేసిన ప్రముఖుల్లో ఒకరని ఆయన గురించి ఎవరైనా చెబుతారు.

ఆయన కళల పయనం సాగెనిలా..

చంద్రది వ్యవసాయ కుటుంబమే. నాన్న ఆజాంజాహి మిల్లులో ఉద్యోగం. చంద్ర చిన్నప్పుడు వరంగల్ లోనే ఉండేవారు. నాన్నకి ఉద్యోగం ఆప్కోలో రావడంతో ఆ కుటుంబం మకాం హైదరాబాద్ కు మారింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా.. చంద్ర చిన్నప్పుడే బాత్ రూమ్ లో గోడ మీద బొగ్గుతో బూతు బొమ్మ వేసేశారు. అది చూసి ‘అమ్మ నా కొడకా’ అంటూ వాళ్ల నాయన ఆయన వీపు చీరేశారట. చంద్రకు కావలసింది ఆ బొమ్మ వేయడం.. అందులో బూతు ఉందన్న సంగతే ఆయనకు తెలియని వయసది. హైదరాబాద్ లో పల్ల దుర్గయ్య ఇంట్లో అద్దెకు దిగారు. ఆయన ఉస్మానియాలో తెలుగు అధ్యాపకులు.

ఇరుగుపొరుగున ఉన్నది ఎవరనుకుంటున్నారు.. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరధి, జర్నలిస్టు చక్రవర్తి రంగస్వామి.. మరి వారందరి గాలి చంద్ర మీద సోకుకుండా ఎలా ఉంటుంది. లైబ్రరీకి వెళ్తుంటే ఆంధ్ర పత్రికతో అనుబంధం ఏర్పడింది. అందులోని బాపూ బొమ్మలే చంద్రకు చిత్రలేఖనం పాఠాలయ్యాయి. అలా పీయూసీ చదివేటప్పుడే ఓ బొమ్మ వేసేసి పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈలోగా ప్రిన్సిపల్ నుంచి కబురొచ్చింది. బొమ్మ బాగా వేశావని మెచ్చి మేకతోలు కప్పుతారని చంద్ర భావిస్తే అక్కడ అవమానం ఎదురైంది. తన బొమ్మను కాపీ కొట్టారంటూ న్యాయనిర్ణేతల్లో ఒకరు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ కోప్పడ్డారు. తాను కాపీ కొట్టలేదని ఎంత చెప్పిన వినరే. ఆ అవమాన భారం తట్టుకోలేకపోయారు చంద్ర.

‘నిందలు వేసిన చేతులతోనే దండలు వేయించుకుంటాను’ అంటూ శపథం చేసుకున్నారు. పీయూసీ పాసైతే డాక్టర్ కోర్సులో చేర్పించేస్తారని కావాలనే పరీక్ష తప్పారు. పరీక్షల్లో తప్పినా ప్రేమలో మాత్రం పాసయ్యారు. తనకన్నా వయసులో పెద్దదైన టీచర్ తో ప్రేమలో పడ్డారు. ఇంట్లో ఇష్టంలేకపోయినా ఆమెతో వేరు కాపురం పెట్టారు. ఫైనార్ట్స్ కాలేజీలో చేరి చదువుకుంటూనే ఇంకో పక్క పత్రికలకు బొమ్మలు వేసేవారు. అలా రెగ్యులర్ గా ‘యువ’ పత్రికకు బొమ్మలు వేసేవారు. అప్పట్లో వచ్చే ప్రతి పత్రిక నుంచి కూడా బొమ్మల కోసం చంద్రనే అడిగేవారు. రంగనాయకమ్మ, తురగా కృష్ణమోహన్, నెల్లూరు కేశవరావులాంటి రచయితలు కథలు రాస్తే బొమ్మలు చంద్రతోనే వేయించుకునేవారు. అలా ఆయా కథలతో పాటు చంద్ర పేరు కూడా జనంలోకి వెళ్లిపోయింది.

బాపు తర్వాత ఎవరంటే చంద్ర అనే అనేవారు ఎవరైనా. న్యూవేవ్ రైటర్స్ లో చంద్ర కూడా ఒకరు. 150కు పైగా కథలు రాశారు. యర్రంశెట్టి శాయి, పమ్మి వీరభద్రరావుతో కలిసి గొలుసు నవల కూడా రాశారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు, మంచుపల్లకీ, తరంమారింది, ఓ అమ్మకథ, డిటెక్టివ్ నారద లాంటి దాదాపు పాతిక చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గానూ పనిచేశారు. 40 ఏళ్ల వయసులో అంబేద్కర్ యూనివర్శిటీలో ఆర్టిస్ట్ గా చేరారు. బాపు లాగా సినిమాలకు దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఉన్నా అది మాత్రం నెరవేరలేదు. రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇంద్రధనుస్సు,వెన్నెలవేట మొదలైన టి.వి. సీరియల్స్‌ను కూడా రూపొందించారు.నాలుగు అక్షరాలు రాయడానికే ఆపసోపాలు పడే జనాలున్నరోజులివి. అలాంటిది వేలకు వేల బొమ్మలు వేయడం అంటే మాటలా.. అమ్మో అనేస్తారు ఎవరైనా.. కానీ చంద్ర అలా అనలేదు తన షష్టిపూర్తి రోజు కూడా ఇంకో అరవయ్యేళ్ల పాటు బొమ్మలు వేస్తూనే బతకాలని ఉందన్న కోరికను వ్యక్తం చేశారు. ప్రజాచిత్రకారుడైన చంద్ర అర్ధాంతరంగానే తనువు చాలించారు.

భగీరథంపై వెలిగిన ‘చంద్ర’కలం

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాసిన తొలి పుస్తకం ‘మానవత’ కవర్ పేజీపై చంద్ర ‘కలం’ ఆయనలోని కళకు ఓ మచ్చుతునక. చంద్ర మరణవార్త ఎందరినో కలవరపర్చింది. వారిలో భగీరథ కూడా ఒకరు. చంద్ర కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు కథకుడు, నటుడు, కళా దర్శకుడు, అన్నింటికీ మించి మంచి మిత్రుడు అంటారు భగీరథ. ఎందరో వర్ధమాన చిత్రకారులకు ఆయన ప్రేరణగా చెబుతారు.

చంద్రతో తనకు 1975 నుంచి పరిచయం ఉందని భగీరథ చెప్పారు. ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ ఇంట్లో ఉండే సమయంలోనే భగీరథ అయన్ను కలిశారట. అమ్మాయిల బొమ్మలను నాజూకుగా గీయడంలో చంద్ర తనకు తానే సాటి అని జనం అనుకుంటుండేవారంటారు భగీరథ. చంద్ర కుంచె ఆగిపోయినా.. గతంలో ఆయన గీసిన చిత్రాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని భగీరథ నివాళులర్పించారు.

– హేమసుందర్ పామర్తి

Tags: am kcr latest newsartist chandraartist chandra deathartist chandra latest newsartist chandra paintingartist chandra wikiartist chnadra movieschandra paintings listcm kcrcm kcr about artist chandraleo newsleotopmidam chandrasekharmydam chandra sekhar latest newspainter baapupainter chandra artist chandra death newspainter chandra deathspecial story of artist chandratelangana latest newstelangana painter chandrawarangal latest news
Previous Post

మీవి, మంత్రుల‌వేనా ప్రాణాలు.. పిల్లలవి ప్రాణాలు కావా? : జగన్ తీరుపై నారా లోకేశ్ ఫైర్

Next Post

మార్వెల్ ప్రపంచంతో ‘బ్లాక్ విడో’

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

దుబ్బాక ఎన్నిక‌‌ : ఇప్పుడు టీఆర్ఎస్ నేత‌ల ఇళ్ల వంతు!

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

పారితోషికం పెంచేసిన కన్నడ కస్తూరి

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist