సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌మిశ్ర(66)జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఛైర్మన్‌గా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.అయిదేళ్ల పాటు లేదా 70 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.ఆయనతో పాటు ప్యానల్ సభ్యులుగా జస్టిస్ ఎం.ఎం.కుమార్,రాజీవ్ జైన్‌లు బాధ్యతలు స్వీకరించారు.ఇంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు పదవీకాలం గత ఏడాది డిసెంబరులో ముగిసింది.అప్పటి నుంచి ఎన్‌హెచ్‌ఆర్‌సిలో సభ్యునిగా ఉన్న జస్టిస్ ప్రపుల్ల పంత్ తాత్కాలిక ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Must Read ;- నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. NHRC ఛైర్మన్‌కు రఘురామ ఫిర్యాదు










