తన ఓటు హక్కు ఏపీలో సాధించుకునేందుకు హైకోర్టును ఆశ్రయిస్తానని ఇవాళ పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీలో స్థానిక ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామని, ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన మీడియాకు వెల్లడించారు. రీపోల్ లేకుండా ఎన్నికలు పూర్తి చేయడం అరుదుగా మాత్రమే సాధ్యమన్నారు. తన ఓటు తెలంగాణలో రద్దు చేసి, ఏపీలో ఇవ్వాలని అధికారులను అడిగినట్టు తెలిపారు. వారు నిరాకరించడం వల్లే వివాదం తలెత్తిందన్నారు. తన ఓటు హక్కు వ్యవహారం గుంటూరు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఏపీలో ఓటు హక్కు సాధించుకునేందుకు అవసరం అయితే హైకోర్టుకు వెళతానన్నారు.
ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో ఇతర వ్యవస్థల జోక్యం తగదు
ఎన్నికల కమిషన్‌కు 243కె ద్వారా రాజ్యాంగం విస్తృత అధికారాలు కల్పించిందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసిందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో ఇతర వ్యవస్థలు జోక్యం చేసుకోకూడదని నిమ్మగడ్డ హితవు పలికారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ కూడా వెయ్యనివ్వలేదని గుర్తించిన ప్రాంతాల్లో మరోసారి నామినేషన్ వేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు మీడియా అందించిన సహకారంపై విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు.
Must Read ;- నిమ్మగడ్డను తీసేయాలంటే నిబంధనలు.. ఇప్పుడవి గాలికి











