ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా చేపట్టాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు చేపట్టడం సాధ్యం కాదని ఎస్‌ఈసీ ప్రకటించింది. తన పదవీ కాలం కూడా మార్చి 31తో ముగిసిపోతుందని, కొత్తగా వచ్చే ఎన్నికల కమిషనర్ పరిషత్ ఎన్నికల బాధ్యతలు చూస్తారని నిమ్మగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్‌లో పరిషత్ ఎన్నికలు
ఈ నెల 31తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త ఎస్ ఈ సీని నియమించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మాజీ సీనియర్ ఐఏఎస్ శ్యామ్యూల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ముగ్గురు మాజీ సీనియర్ అధికారుల పేర్లుతో కూడిన లిస్ట్‌ను గవర్నర్‌కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అయితే నిమ్మగడ్డ స్థానంలో శ్యామ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వస్తారని ప్రచారం జరగుతోంది. వచ్చే నెలలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Must Read ;- ఆ విషయంలో జోక్యం చేసుకోలేం.. పరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీదే నిర్ణయం