పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న జానపద చిత్రం ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దంలోని మొఘలాయిల పరిపాలన నేపథ్యంలో .. ఈ సినిమా కథ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ కాలంలోని ఒక గజదొంగగా నటిస్తున్నాడట. కోహినూర్ వజ్రం ప్రధానంశంగా ఉంటుందట. ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’ టైటిల్ రివిలేషన్ , మోషన్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
బాలీవుడ్ స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ నేతృత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాలోని యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. పవర్ స్టార్ పై ఇటీవలే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట. అదే సమయంలో ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోన్న మలయాళ నటుడు ఆదిత్య మీనన్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గుర్రపు స్వారీ చేస్తుండగా.. ఆదిత్య కు తీవ్రమైన గాయాలు తగిలాయట. వెంటనే ఆయన్ను సిటీలోని యశోదా హాస్పిటల్ లో జాయిన్ చేశారట. అయితే మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారట.
Must Read ;- వందమందితో ‘వీరమల్లు’ పోరాటం!