ఐపీఎల్.. క్రీడా ప్రపంచంలో సరికొత్త జోష్ నింపింది. క్రికెట్ ను మరోలోకంలోకి తీసుకెళ్లింది. ఆట స్వరూపాన్నే మార్చేసింది. క్రికెటర్ల జీవితాలను స్థిరం చేసేసింది. ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా చితికిపోతున్న బతుకుల్లో వెలుగులు నింపింది. అటువంటి ఐపీఎల్.. ప్రస్తుతం మరో క్రికెటర్ జీవితాన్ని డబ్బులతో నింపేయబోతోంది. పొట్టి క్రికెట్ తో వందకోట్లు సంపాదించిన వారి జాబితాలో మరో టీమిండియా ఆటగాడి పేరు పదిలం కాబోతోంది.
వందకోట్లు చాలామంది కలలో కూడా ఊహించలేని మొత్తం. కేవలం క్రికెట్ తోనే వందకోట్లు సంపాదించడం అంటే.. ఏ క్రికెటర్ కు ఊహకే అందని విషయం. అయితే.. పొట్టి ఫార్మాట్ ఆ కలలన్నీ నిజం చేస్తోంది. ఇప్పటికీ టీమిండియా క్రికెటర్లు ధోనీ, కోహ్లీ, రోహిత్ లకు ఆ మజాను రుచి చూపించింది. ఇప్పుడు.. రైనాను సైతం ఆ అదృష్టం వరించబోతోంది.
అగ్రస్థానం ధోనీదే…
ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి రూ.150 కోట్ల వేతనం తీసుకున్న ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్ లో రికార్డు బ్రేక్ చేయనున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఇంతగా వేతనం తీసుకున్న ఆటగాడు లేడు. మొత్తం 13 సీజన్‌లు కలుపుకుని ఆయన అందరికంటే అధికంగా రూ.137 కోట్లను వేతనంగా పొందాడు. 2008 నుంచి 2021 సీజన్ దాకా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఏకైక క్రికెటర్ కూడా మహేంద్ర సింగ్ ధోనీనే!
మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్…
ధోనీ తర్వాత ఆ స్థానాన్ని పదిలం చేసుకున్న వ్యక్తి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ ద్వారా అత్యధిక మొత్తం తన ఖాతాలో వేసుకుంటున్న రెండో క్రికెటర్ ఇతనే. హిట్ మ్యాన్ ఐపీఎల్ ద్వారా రూ.131.60 కోట్లు అర్జించాడు. ఈ సీజన్‌లో రోహిత్‌కు ముంబై ఇండియన్స్ రూ.15 కోట్లు ఇస్తుంది. అంటే.. రూ.146 కోట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉంటాడు.మూడోస్థానంలో కోహ్లీ…
కొద్ది సీజనల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇప్పుడు రూ.126 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ ఈ ఏడాది రూ.17 కోట్లు తన ఖాతాలో వేసుకోనున్నాడు. దీంతో 143 కోట్ల రూపాయలతో మూడోస్థానంలో కొనసాగనున్నాడు విరాట్ కోహ్లీ.ఆ జాబితాలోకి సురేశ్ రైనా…
ఐపీఎల్ ద్వారా వందకోట్ల రూపాయలు అర్జించిన వారిలో చోటు సంపాదించుకోబోతున్నాడు టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా. ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత ఆ అరుదైన ఘనత సాధించబోతున్నాడు. ఈ ఏడాది బరిలోకి సీఎస్ కే తరుపున బరిలో దిగనున్నాడు. ప్రస్తుతం రూ.99.74 కోట్లతో ఉన్న సురేశ్ రైనా, ఐపీఎల్ వేతనంగా రూ.11 కోట్లు అందుకోనున్నాడు. దీంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు.మొదటి విదేశీ ఆటగాడు డివిలియర్స్…











