జూనియర్ ఎన్టీఆర్ అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ నటించబోయే 30వ చిత్రం ఏమిటన్నసస్పెన్స్ అందరిలోనూ నెలకొంది. ఈరోజు సాయంత్రం అప్ డేట్ వస్తుందని నిర్మాత మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తారక్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాకి సమర్పకుడు నందమూరి కళ్యాణ్ రామ్. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. జూన్ ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమాని విడుదలచేయనున్నారు. అధికారికంగా వెల్లడైన వివరాలివి. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. దాంతో మరోసారి కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ రూపొందిన సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి ఈ కాంబినేషన్ పునరావృతమవుతోంది.
Must Read ;- యన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా లంకేశ్?