యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని రెండో సినిమా.. త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కోవిడ్ కారణంగా.. ఈ సినిమా పనులు చాలా లేట్ గా మొదలయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుతో ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ షూటింగ్ కంప్లీట్ కాబోతోంది. ఆ తర్వాత అంటే మే నుంచి తారక్, త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాలో కథానాయికగా రష్మికా మందన్నను కన్ఫమ్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.. అందులో భాగంగా ఇందులో తారక్ కు సరైన విలన్ ను త్రివిక్రమ్ సెట్ చేస్తున్నాడట.
తాజా సమాచారం ప్రకారం .. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ను విలన్ గా ఎంపిక చేశాడట త్రివిక్రమ్. ఆల్రెడీ సైఫ్ ఆలీఖాన్.. ప్రభాస్ , ఓంరౌత్ మూవీ ‘ఆదిపురుష్’ లో రావణుని పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ మూవీలో సైఫ్ విలన్ గా నటించనుండడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఇందులో తారక్ ను ఢీకొట్టే విలన్ సైఫ్ ఆలీఖానే అయితే.. మాత్రం సినిమాకి మంచి బలం చేకూరినట్టే లెక్క. మరి నిజంగానే సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Also Read:త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!