అఖిల్ ను ఎన్టీఆర్ ఎందుకు గిల్లాడో తెలియదుగానీ ఆ గిల్లుడు మీద వర్మ వేసిన సెటైర్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక హీరోయిన్ల భవిష్యత్తు ఏంటి అంటూ ఆ వీడియో కి కామెంట్ ను జతచేసి వర్మ షేర్ చేశాడు. ఎవరూ దాన్ని అంతగా పట్టించుకోక పోయినా వర్మ షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, అఖిల్ కలిసి ఓ ఫంక్షన్ లో పక్కపక్కనే కూర్చున్నారు.
ఏంజరిగిందో ఏమో ఎన్టీఆర్ చిలిపిగా అఖిల్ తొడమీద గిల్లడం, దాన్ని వర్మ బూతద్దంలో చూడటం జరిగిపోయింది. ఎంచక్కాఆ వీడియోని వర్మ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అఖిల్ ను ఎన్టీఆర్ ఆటపట్టించడం, అందుకు అఖిల్ ఇచ్చిన రియాక్షన్ అందరికీ మంచి విందు అందించింది. అఖిల్ అసలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. అలాంటి బ్యాచ్ లర్ తో ఎన్టీఆర్ ఇలాంటి గిల్లుడు ఏమిటో? ఈ గిల్లుడు ప్రభావంతో హిట్లు లేక విలవిల లాడుతున్న అఖిల్ కు దశ తిరిగిపోతుందేమో చూడాలి.
Must Read ;- అఖిల్ సినిమాలో మోహన్ లాల్?











