మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరటి లోడుతో వెళ్తున్న బోల్తా పడింది. జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద లారీ బోల్తా పడడంతో అక్కడికక్కడే 16 మంది మృతి చెందారు. ట్రక్కుతో లోడుతో పాటు 21 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. బోల్తా పడిన వెంటనే 16 మంది అక్కడికక్కడే మరణించారు, మిగిలిన వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారంతా అభోదా, కర్హలా, రావేలా జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు. అధికంగా లోడుతో పాటు.. ఎక్కువమంది ఉండడంతో.. స్పీడుకు అదుపుతప్పి ఉంటుందని పోలీసులు ప్రాధమిక అంచనా వేశారు. ప్రమాదానికి గల అసలు కారణం తెలియాల్సి ఉంది.
Must Read ;- అరకు ప్రమాదం వెనుక ప్రభుత్వాల పాపం ఎంత?