ఇంగ్లాండ్… ప్రపంచానికి క్రికెట్ పాఠాలు నేర్పింది. ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకుంది. కానీ.. చెన్నై టెస్టులో టీమిండియా చేతిలో గింగిరాలు తిరుగుతూ చతికిలపడ్డ దృశ్యం అసంఖ్యాక అభిమానులకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఆ విక్టరీ క్రికెట్ ప్రపంచానికే హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిరస్మరణీయ విజయంపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… చెపాక్ పిచ్‌పై వస్తున్న విమర్శలను ఖండించారు.
ఇరు జట్లకు సమాన అవకాశాలు
చెన్నై స్టేడియంపై ట్రోల్ అవుతున్న విషయాలపై కోహ్లీ స్పందించారు. బంతి టర్న్, బౌన్స్ అవ్వడంపై తామేమీ భయపడలేదని చెప్పారు. ఆటలో ఆధ్యంతం ధైర్యాన్ని ప్రదర్శించామని గుర్తు చేశారు. 600 పరుగులు సాధించామని, ఆ తర్వాత బౌలర్లు మిగిలిన పనిని పూర్తి చేస్తారని తమకు తెలుసని ధీమా వ్యక్తం చేశారు. టాస్ కీలకం అనుకోవట్లేదని, స్పిన్/సీమ్ ట్రాక్‌పై తొలి సెషన్ నుంచే ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉండాలని అభిప్రాయ పడ్డారు.
అభిమానులు కీలక పాత్ర
టీమిండియా భారీ విజయం సాధించడంలో అభిమానులు కీలక పాత్ర పోషించారు. మొదటి టెస్టులో అభిమానులు లేకపోవడంతో.. మైదానంలో నాతో సహా అందరం ఉత్తేజంతో ఆడలేకపోయాం. అయితే రెండో ఇన్నింగ్స్ నుంచి మా దేహభాషలో మార్పులు వచ్చాయి. ఈ టెస్టులో ప్రధాన తేడా ప్రజలే. ధైర్యం, సంకల్పంతో మేం ఆడటానికి కారణం వాళ్లే. నేను బౌలింగ్ చేయడానికైనా అభిమానుల నుంచి మద్దతు అవసరం. మాకు అది ఎంతో లాభించింది.
– విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
Must Read ;- అ స్పిన్ మ్యాజిక్.. టీమిండియా ఉచ్చులో ఇంగ్లాండ్ ఢమాల్!