టెక్కలి జిల్లా ఆసుపత్రిలో NTR ట్రస్టు ద్వారా రూ.35 లక్షలు విలువ గల ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు,సంబంధిత ఉన్నత వైద్యాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్ కోవిడ్ -19 రోగుల చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.టెక్కలిలో ఎప్పటి నుండో ఉన్నఏరియా ఆసుపత్రిని గత తెలుగుదేశం ప్రభుత్వంలో,తాను మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా ఆసుపత్రిగా మార్చడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పనకు అవసరమైన నూతన ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.
Must Read ;- కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ఫ్లాంటు.. రూ.35 లక్షలు ఇస్తున్న చంద్రబాబు