తనపై ఇప్పటికే వైసీపీ నేతలు 6 తప్పుడు కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజలు తిరగబడే రోజులొస్తాయని అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్బావ వేడుకలను పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో టీడీపీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడిందని పరిటాల శ్రీరామ్ అన్నారు. తనపై ఇప్పటికే ఆరు తప్పుడు కేసులు పెట్టారని, ఇంకా ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు టీడీపీ అండగా నిలిచి ఓ శక్తిలా ఆవిర్బవించిందని పరిటాల శ్రీరామ్ కొనియాడారు.
ఎంతో అభివృద్ధి చేశాం
కొత్తగా ఏర్పడిన ఏపీ అభివృద్ధికి టీడీపీ ఎంతో కృషి చేసిందని పరిటాల శ్రీరామ్ గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అంతా దోచుకోవడమేనని, ఎక్కడా అభివృద్ధి అనే మాటే లేదని పరిటాల విమర్శించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని శ్రీరామ్ ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో వాలంటీర్లను అడ్డుపెట్టుకుని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలిచారని, ప్రజలు ఎదురుతిరిగే రోజులొస్తాయని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.
Must Read ;- పోలీస్ స్టేషన్ ముందే పరిటాల శ్రీరామ్‌పై దాడికి వైసీపీ నేతల యత్నం..